పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన తాజా పీరియాడికల్ యాక్షన్ సినిమా హరిహర వీరమల్లు. జూలై 24న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా కీలక పాత్రలో బాబీ డియోల్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, నాజర్ తదితరులు నటించారు.
కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం భారీగా నిర్మించారు. అయితే అందరిలో ఎంతో భారీ అంచనా ఏర్పరిచిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అనంతరం ప్రీమియర్స్ నుండి భారీ డిజాస్టర్ టాక్ ని మూటగట్టుకుంది.
హీరోగా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫస్ట్ హాఫ్, రెండు సాంగ్స్ ఆకట్టుకున్న ఈ మూవీలో విఎఫ్ ఎక్స్ వర్క్ పూర్ గా ఉండడంతో అందరి నుండి తీవ స్థాయిలో మూవీ పై విమర్శలు వచ్చాయి. ఇక దీని అనంతరం సుజీత్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న ఓజి మూవీ పై పవన్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు ఏర్పరుచుకున్నారు.
డివివి ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈమూవీ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్సు ముందుకి రానుంది. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ మాస్ యాక్షన్ తో కూడిన గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీగా రూపొందుతోంది. మరి పవన్ కు వీరాభిమాని అయిన సుజీత్, ఓజి మూవీతో ఎంతమేర సక్సెస్ అందిస్తాడో చూడాలి.