Homeసినిమా వార్తలుతెలుగు రాష్ట్రాల టాప్ 5 ప్రీ రిలీజ్ బిజినెస్ లిస్ట్ లో 'OG'

తెలుగు రాష్ట్రాల టాప్ 5 ప్రీ రిలీజ్ బిజినెస్ లిస్ట్ లో ‘OG’

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ ఓజి. ఈ మూవీలో అందాల నటి ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

ఇటీవల రిలీజ్ అయిన ఓజి ఫస్ట్ గ్లింప్స్ ఎంతటి భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దానితో మూవీ పై అంచనాలు అందరిలో అమాంతంగా పెరిగిపోయాయి.

తాజాగా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఓజి మూవీ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా భారీ స్థాయిలో ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక ఈ సినిమా తాజాగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 150 కోట్ల బిజినెస్ జరుపుకుని టాప్ 5 ప్లేస్ లో నిలిచింది.

కాగా అంతకముందు ఆర్ఆర్ఆర్, సలార్, కల్కి 2898 ఏడి, పుష్ప 2 సినిమాలు గతంలో ఈ రేంజ్ బిజినెస్ జరుపుకున్నాయి. అయితే ఆ నాలుగు సినిమాలు భారీ కాంబినేషన్స్ తో రూపొందగా కేవలం పవన్ కళ్యాణ్ బ్రాండ్ ఇమేజ్ తో ఈ మూవీ ఇంత భారీ బిజినెస్ జరుపుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. మరి ఈ మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp

READ  ఓజి : పవర్ స్టార్ ఆగమనానికి ముహూర్తం సిద్ధం


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories