పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన జనసేన పార్టీ కార్యకలాపాతో పాటు ఆంధ్ర డిప్యూటీ సీఎంగా ఎంతో బిజీ బిజీగా కొనసాగుతున్నారు. ఇక మరోవైపు ప్రస్తుతం కెరీర్ పరంగా మూడు సినిమాలు చేస్తున్నారు పవన్. అవి క్రిష్, జ్యోతి కృష్ణ కలిసి తీస్తున్న హరి హర వీర మల్లు, సుజిత్ తీస్తున్న ఓజి, హరీష్ శంకర్ తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ .
ఇక ఈ మూడు మూవీస్ పై పవన్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. కాగా వీటిలో పవన్ తో సుజీత్ తీస్తున్న పాన్ ఇండియన్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ ఓజి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని పవన్ ఫ్యాన్స్ మరింతగా ఎదురు చూస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
విషయం ఏమిటంటే, ఇటీవల కొంత మేర షూట్ జరుపుకున్న ఓజి మూవీ లేటెస్ట్ షెడ్యూల్ తాజాగా ప్రారంభం కాగా త్వరలో పవన్ కళ్యాణ్ షూట్ లో జాయిన్ అవ్వనున్నట్లు టీమ్ ప్రకటించింది. ఇక ఈ మూవీ వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది.