పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పొలిటికల్ గా చాలావరకు బిజీగా కొనసాగుతున్నారు. మరోవైపు ఆయన చేయాల్సిన మూడు సినిమాలు సగభాగం షూటింగ్ జరుపుకుని తదుపరి షెడ్యూల్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రస్తుతం సుజీత్ తో ఓజి, జ్యోతి కృష్ణ తో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు పవన్.
ఈ మూడింటి పై పవన్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక వీటిలో పాన్ ఇండియన్ మూవీ ఓజి గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
సెప్టెంబర్ 27న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వాయిదా పడిన విషయం తెలిసిందే. విషయం ఏమిటంటే, లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసేందుకు పవన్ కళ్యాణ్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, సెప్టెంబర్ నుండి ప్రారంభం కానున్న ఈ మూవీ, అక్కడి నుండి మిగతా భాగం మొత్తం కూడా షూటింగ్ జరుపుకుంటుందని అంటున్నారు. ఇక ఓజి మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.