రాజకీయాలలో అడుగు పెట్టినప్పటి నుండీ సినిమాల పట్ల పవన్ కళ్యాణ్ వైఖరి కాస్త మారింది. వీలయినంత వరకు తక్కువ బడ్జెట్, తక్కువ సమయంలో షూటింగ్ కానిచ్చేసి సినిమాలు తీయడం మొదలు పెట్టాడు.
స్ట్రెయిట్ సినిమాలు తీస్తే స్క్రిప్ట్ వర్క్ కి కూడా సమయం కేటాయించాల్సి వస్తుంది కాబట్టి ఎక్కువగా రీమేక్ ల వైపే మొగ్గు చూపడం స్పష్టంగా కనిపిస్తుంది గత నాలుగైదు ఏళ్లలో.
ఇప్పుడు ఆ పద్ధతి తప్పా ఒప్పా అన్నది పక్కన పెడితే పవన్ ఇలా చేయడం వలన ఆయా సినిమాల ప్రొడ్యూసర్ లకి ఈ వ్యవహారం వల్ల డబ్బులు బాగానే కలిసి వచ్చాయి, తక్కువ ఖర్చు ఎక్కువ ఆదాయం అన్నా స్కీమ్ తరహాలో అన్నమాట.
అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం అక్టోబర్ నుండి బస్సు యాత్ర ప్రారంభించనున్న పవన్ కళ్యాణ్ ఆలోపు తను ఓప్పుకున్న సినిమాలు తమిళ రీమేక్ వినొదాయ సితం, హరిష్ శంకర్ దర్శత్వంలో రాబోయే భవదీయుడు భగత్ సింగ్ లను పూర్తి చేసేసి ఇక దీర్ఘకాలపు రాజకీయాల వైపు దృష్టి పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
ఆ వార్తలు నిజం అయితే మళ్ళీ కొన్ని రోజుల పాటు పవన్ కళ్యాణ్ సినిమాలకి దూరం అవ్వక తప్పదు. ఇది ఫ్యాన్స్ కి కాస్త బాధ కలిగించేదే అయినా ప్రజానాయకుడిగా రాబోయే ఎన్నికలకు సిద్ధం అవడానికి ఇది తొలి అడుగుగా భావిస్తే మంచిదే.