మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా అందాల కథానాయక కియారా అద్వానీ హీరోయిన్ గా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న తాజా సినిమా గేమ్ చేంజర్. ఈ భారీ పాన్ ఇండియన్ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా కీలకపాత్రలో శ్రీకాంత్, ఎస్ జె సూర్య, అంజలి, సునీల్ నటిస్తున్నారు.
ఇప్పటికే అందరిలో భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచిన గేమ్ ఛేంజర్ మూవీ జనవరి 10న సంక్రాంతి కానుక గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. మరోవైపు గేమ్ ఛేంజర్ నుంచి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. అయితే విషయం ఏమిటంటే ఈ మూవీ యొక్క ప్ర రిలీజ్ ఈవెంట్ ని త్వరలో కాకినాడలో గ్రాండ్ గా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక ఈవెంట్ కి టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిధిగా హాజరు కానున్నారట. ఇప్పటికే ఈ విషయమై గేమ్ ఛేంజర్ టీమ్ పవన్ ని కలిసినట్లు చెప్తున్నారు. అయితే ఈ న్యూస్ పై ఆ మూవీ మేకర్స్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఒకే స్టేజిపై అటు బాబాయి, ఇటు అబ్బాయిలను చాలాకాలం తర్వాత చూడొచ్చన్నమాట.