పవన్ కళ్యాణ్ కేవలం తన స్టైలింగ్, యాటిట్యూడ్ పరంగానే కాకుండా యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన చాలా సినిమాల్లో ఫైట్స్ ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.
దానికి కారణం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో బాగా శిక్షణ పొందడమే. అయన హీరోగా చారిత్రాత్మక నేపథ్యంలో సాగే యోధుడి కాన్సెప్ట్ తో దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ తన పాత చిత్రాలైన ఖుషి, తమ్ముడు వంటి చిత్రాలలో తప్ప తన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలను ఎప్పుడూ ప్రదర్శించలేదు.
అయితే, రెండు దశాబ్దాల తర్వాత మార్షల్ ఆర్ట్స్ లోకి తిరిగి వస్తున్నట్లు పవన్ స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన మార్షల్ ఆర్ట్స్ లో కొత్త మెళకువలు నేర్చుకుంటున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ట్రైనింగ్ సెషన్ నుండి ఒక చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇది ఇప్పుడు అన్ని చోట్లా వైరల్ అవుతోంది. ఈ ఒక్క చిత్రం అభిమానుల్లో ప్రకంపనలు సృష్టించింది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు సినిమా పై పూర్తి ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారానికి బయలుదేరే ముందు మరో రెండు ప్రాజెక్టులను పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. సుజీత్ తో తన కొత్త చిత్రం ఇటీవల ప్రకటించబడింది, మరియు ఆయన త్వరలో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సెట్స్ లో జాయిన్ అవుతారు. గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ తో కూడా మరో సినిమా చేయనున్నారు.
ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు కానీ వచ్చే వేసవిలో ఈ సినిమా రిలీజ్ అవుతుందని అంటున్నారు.
హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల పై పూర్తిగా దృష్టి పెట్టాలని భావిస్తున్నారట.