తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన ఇలయదళపతి విజయ్ హీరోగా ఇటీవల వెంకట్ ప్రభు దర్శకత్వంలో తరకెక్కిన తాజా సినిమా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం. ఈ సినిమాలో స్నేహ మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించగా కీలకపాత్రల్లో ప్రభుదేవా, ప్రశాంత్, లైలా, మోహన్ నటించారు. మొత్తంగా అందరి అంచనాలు అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఇక దీని అనంతరం ఇప్పటికే తన కెరీర్ ఆఖరి సినిమా అనగా 69వ సినిమాని యువ దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వంలో అనౌన్స్ చేశారు విజయ్.
ఈ సినిమాపై అందరిలో భారీస్థాయి అంచనాలు ఉండగా దీనిని వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయనున్నారు. ఇకపోతే అసలు విషయం ఏమిటంటే ఇప్పటికే తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం ని అనౌన్స్ చేశారు విజయ్. నిన్నటి ఆ పార్టీ భారీ బహిరంగ సభకు దాదాపుగా కొన్ని లక్షల మంది విచ్చేసి విజయ్ ఆశీర్వదించారు. ఇక విజయ్ కూడా తన అభిమానులు అందర్నీ ఆకట్టుకునే అద్భుతమైన ప్రసంగం చేశారు.
అసలు విషయం ఏమిటంటే కొద్దిసేపటికి టాలీవుడ్ పవర్ స్టార్ మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా తన ట్విట్టర్ వేదికగా విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై శుభాభినందనలు తెలియజేశారు. విజయ్ రాజకీయాల్లో మరింతగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని పవన్ అభినందనలు తెలిపిన ట్విట్టర్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి విజయ్ రాబోయే తమిళనాడు ఎన్నికల్లో ఎంతమేరకు విజయ బావుటా ఎగురవేస్తారో చూడాలి.