Unstoppable with Nbk2 షోకు అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు అనే వార్త ఇటీవలే అందరి దృష్టిని ఆకర్షించింది. దీని పై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, ఈ వార్త దాదాపు నిజమేనని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ ను అన్ స్టాపబుల్ 2 షోకు రప్పించడానికి యూనిట్ చాలా కష్టపడ్డారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. నిజానికి ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ కే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను రప్పించాలని అనుకున్నారట.
అయితే పవన్ కళ్యాణ్ అందుకు అంగీకరించడానికి చాలా సమయం తీసుకున్నారని, తాజాగా అన్‌స్టాపబుల్ సిబ్బంది అభ్యర్థనను ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ తో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా గెస్ట్ గా వచ్చే అవకాశం ఉందని గట్టిగా వినిపిస్తోంది.
భారీ క్రేజ్ తో ప్రారంభమైన అన్‌స్టాపబుల్ సీజన్ 2 ప్రతి ఎపిసోడ్ కు ఆసక్తికరమైన అతిథులను తీసుకురావడానికి యూనిట్ ప్రయత్నిస్తున్నప్పటికీ, మొదటి సీజన్ తో పోలిస్తే ఈసారి షో పెద్దగా క్లిక్ కాలేదని తెలుస్తోంది.
ఇటీవలే ప్రభాస్ ని గెస్ట్ గా తెచ్చి యూనిట్ చాలా హంగామా చేసిన సంగతి తెలిసిందే. ఈ ఐడియా షోకు మంచి హైప్ తెచ్చిపెట్టింది మరియు ప్రభాస్ అభిమానులు పూర్తి ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక రాబోయే ఎపిసోడ్లలో జయసుధ, జయప్రద అన్‌స్టాపబుల్ సీజన్ కు అతిథులుగా హాజరవబోతున్నారని సమాచారం. అలాగే వీరసింహారెడ్డి టీం కూడా కనిపించనున్నారని తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు మరియు నందమూరి అభిమానుల ముందుకు రాబోతుంది.
ఇక ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పై నవీన్ యెర్నేని- వై రవిశంకర్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా మాటలు అందించారు.