పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా అందాల కథానాయిక ప్రియాంక మోహన్ హీరోయిన్ గా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ ఓజి. ఈమూవీ పై ప్రారంభం నాటి నుండి పవన్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈమూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు.
ఇక ఇటీవల ఓజి నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్, పోస్టర్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచాయి. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఓజి మూవీలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించనున్నారు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది.
విషయం ఏమిటంటే, ఈ మూవీ నుండి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భముగా సెప్టెంబర్ 2న ఒక అప్ డేట్ ని అందించనున్నారు మేకర్స్. కాగా అది ఫస్ట్ సాంగ్ అని లేటెస్ట్ టాలీవుడ్ బజ్. అయితే దాని పై అతి త్వరలో మేకర్స్ నుండి క్లారిటీ రానుంది. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ చేసే అవకాశం ఉంది.