Homeసినిమా వార్తలుPawan Kalyan: పవన్ కళ్యాణ్ - బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ 2 ఎపిసోడ్ ప్రీమియర్ వివరాలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ 2 ఎపిసోడ్ ప్రీమియర్ వివరాలు

- Advertisement -

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో అన్‌స్టాపబుల్‌ కి తాజాగా రాబోయే అతిథి కారణంగా వార్తల్లో నిలుస్తోంది. ఈ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు కనిపించబోతున్న ఆ సూపర్ స్టార్ గెస్ట్ మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవటం విశేషం.

కాగా ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం అవుతుందా అని ఎదురుచూస్తోన్న అభిమానుల‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌. తాజాగా ఈ ఎపిసోడ్ తాలూకు ప్రోమోను రిలీజ్ చేసింది. కాగా రిలీజైన కొద్ది నిమిషాల్లోనే ఈ ప్రోమో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అలాగే ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా విభజించిన ఆహా, తొలి భాగం ఫిబ్రవరి 3న ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది.

https://twitter.com/ahavideoIN/status/1618964485930356736?t=mRjwMxEV0PzqUZCEyIilZA&s=19

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎంట్రీ ఇచ్చే సీన్‌తో ప్రోమో ప్రారంభ‌మైంది. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఉద్దేశించి ఈశ్వ‌రా…ప‌వ‌నేశ్వ‌రా అంటూ బాల‌కృష్ణ అన‌డం.. దానికి బదులు పవన్ నేను మీకు తెలుసు…నా స్థానం మీ మ‌న‌సు అంటూ బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ థీమ్ డైలాగ్‌ను చెప్పడం అందరినీ అలరించింది.

READ  Nandamuri Balakrishna: అక్కినేని వివాదం పై స్పందించిన నందమూరి బాలకృష్ణ

గుడుంబా శంక‌ర్ సినిమాలో ప్యాంట్ మీద ప్యాంట్ వేశావు…పాతికేళ్లు త‌గ్గావు తెలుసా ప్యాంట్ వేస్తే అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో బాల‌కృష్ణ అన‌డం ప్రోమోకు హైలెట్‌గా నిలిచింది. మ‌నం ఫ‌స్ట్ టైమ్ ఎక్క‌డ క‌లిశామో గుర్తుందా అమ్మా నీకు అంటూ ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌లు అభిమానుల‌ను ఎపిసోడ్ మొత్తం ఎప్పుడు చూద్దామా అనుకునేలా చేశాయి.

త్రివిక్ర‌మ్‌ శ్రీనివాస్ తో స్నేహం గురించి, అలాగే మూడు పెళ్లిళ్ల‌ పై ఈ షోలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడినట్లుగా ఈ ప్రోమోలో చూపించారు. అలాగే ఇదే ఎపిసోడ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు యువ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ హాజ‌రైన‌ట్లుగా ప్రోమోలో చూపించారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన పాన్ ఇండియా సినిమా హరి హర వీరమల్లు షూటింగ్ లో బిజీగా ఉన్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కాగా బాబీ డియోల్, నర్గీస్ ఫక్రి ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  Vaarasudu: తెలుగు రాష్ట్రాల్లో పేలవమైన వసూళ్లతో ప్రారంభమైన విజయ్ వారసుడు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories