కన్నడలో సినీ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన పవిత్ర లోకేష్ అనతికాలంలోనే భాషలకు అతీతంగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అవకాశాలు అందిపుచ్చుకోవడమే కాకుండా మంచి పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. ప్రస్తుతం సౌత్ లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ గా రాణిస్తోంది. అయితే ఇప్పుడు ఆమె వ్యక్తిగత జీవితంపై పలు రకాల పుకార్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఆమె సినీ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయని చర్చలు జరుగుతున్నాయి.
పవిత్ర లోకేశ్, తెలుగు సీనియర్ నటుడు నరేష్ లపై గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు అని.. కాదు సహజీవనం అనీ ఇలా రకరకాల పుకార్లు చక్కర్లు కొట్టాయి.ఎక్కడికైనా ఇద్దరూ కలిసే వెళ్లడం,ఇటీవల మహాబలేశ్వర్ లో ఒక స్వామిజీని దర్శించుకోవడంతో వీరి వ్యవహారం పై పుకార్లు ఎక్కువ అయ్యాయి.
ఈ క్రమంలో ఈ సీనియర్ నటీనటులిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో నరేష్ మూడో భార్య రమ్య అడుగుపెట్టడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
తనకు చెడ్డ పేరు తేవడానికే నరేశ్ మూడో భార్యనని చెప్పుకునే రమ్య రఘుపతి ఇలాంటి ఆరోపణలు చేస్తోందని పవిత్ర లోకేష్ ఈ విషయం పై బెంగుళూరులో ప్రెస్ మీట్ పెట్టి తన పరువుకి భంగం కలిగించే ప్రయత్నం చేస్తోందని చెప్పగా, ఈ విషయంలో నరేష్ కూడా తన స్పందనను తెలియజేస్తూ వీడియో వదిలి..తమ ఇద్దరినీ సపోర్ట్ చేయాల్సిందిగా అందరినీ కోరారు.
అయితే మైసూర్ లోని ఓ హోటల్ గదిలో నరేశ్ – పవిత్ర కలిసి ఉండటం..అదే సమయంలో మీడియా సమక్షంలో రమ్య రఘుపతి వీరిద్దరితో వాగ్వాదం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. నరేష్ తో పవిత్ర హోటల్ గదిలో కనిపించడంపై ఇండస్ట్రీలో కూడా పలు విధాలుగా మాట్లాడుకుంటున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారంతో ఆమె కెరీర్ ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.
తెలుగులో తల్లి, అత్త పాత్రల్లో తనదయిన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఆయా పాత్రల్లో వేరే ఎవరినీ ఊహించలేని విధంగా ముద్ర వేశారు. తాజాగా రగిలిన వివాదం కారణంగా ఆమెను మళ్ళీ కుటుంబ సభ్యుల పాత్రల్లో ప్రేక్షకులు అదేవిధంగా చూస్తారా లేదా అనే అనుమానాలు ఇండస్ట్రీలో కలుగుతున్నాయట. ఇప్పటికే రెండు పెద్ద సినిమాల్లో తల్లి పాత్రల నుంచి ఆమెను తప్పించారని సమాచారం.
ఈ వివాదం ఇలా జరగడానికి నరేష్, పవిత్రల ఎమరుపాటు కారణం కావచ్చు,లేదా నరేష్ మూడో భార్య స్వార్థం కావచ్చు లేదా మీడియా అత్యుత్సాహం కావచ్చు కారణాలు ఏవైనా ఏదేమైనా వ్యక్తిగత ఖననం అనేది మహా దారుణమైన విషయం. ఇక నుంచైనా ఇలాంటి వ్యక్తిగత విషయాలు రచ్చకి ఈడ్చకుండా అయా వ్యక్తులు అధికారికంగా ధృవీకరించే వరకూ ఆగితే ఎవరి జీవితాలు వాళ్ళు సాఫీగా బతికే వీలుంటుంది.