టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ 2023 న్యూ ఇయర్ సందర్భంగా తాను, పవిత్ర లోకేష్ ఈ ఏడాది వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించి అందరికీ భారీ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ జంట కొంతకాలంగా సంబంధంలో ఉన్నారన్న పుకారు ఉన్నప్పటికీ.. వీరి వివాహ ప్రకటన వీడియోతో ఆ విషయానికి అధికారిక ముద్ర వేశారు.
నరేష్ మాట్లాడుతూ – “పవిత్ర లోకేష్ నా సహోద్యోగి, హ్యాపీ వెడ్డింగ్ షూటింగ్ సమయంలో మేము మొదటిసారి కలుసుకున్నాము. ఆమె చాలా నెమ్మదైన వ్యక్తి మరియు ఆమె సీన్ల మధ్య పుస్తకాలు చదివేది, దానితో ఆమేతో మాట్లాడటం కష్టంగా ఉండేది. షూటింగ్ సమయంలో మేము 2-3 సార్లు మాత్రమే మాట్లాడుకున్నాం అని నరేష్ వెల్లడించారు.
అయితే అదృష్టవశాత్తు మేము సమ్మోహనం షూటింగ్ సమయంలో మళ్ళీ కలుసుకున్నాము మరియు అక్కడే మేము ఒకరిని ఒకరు ఎక్కువగా తెలుసుకున్నాం. ఆమె అప్పటికే జీవితంలో నరకం అనుభవిస్తోంది మరియు నేను షూటింగ్ పై దృష్టి పెట్టలేనప్పుడు, నేను ఆమె ముందు ఏడ్చాను. ఆమె ఆ సమయంలో నాకు చాలా సహాయం చేసింది. మా వ్యక్తిగత జీవితంలో పరస్పర సమస్యల కారణంగా మేము బంధం పెంచుకున్నాం ” అని నరేష్ వివరించారు.
గత కొన్ని సంవత్సరాలుగా వారి స్నేహం గురించి ఇద్దరూ బహిరంగంగానే ఉన్నారు. అయితే, పవిత్ర లోకేష్ మాత్రం నరేష్ తనకు మంచి ‘స్నేహితుడు, తత్వవేత్త, మార్గదర్శి’ అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే తాజాగా న్యూ ఇయర్ రోజు ఇచ్చిన ప్రకటనతో, నరేష్ తమ సంబంధాన్ని మొదటిసారి బహిరంగపరిచారు.