షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన తర్వాత తాజాగా మరో భారీ మైలురాయిని అందుకుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల క్లబ్ లో చేరడానికి ఒక అడుగు దూరంలో ఉంది.
జనవరి నెల ఆఖరులో రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలై తొలి వారం సంచలన స్థాయిలో వసూళ్లు రాబట్టిన తర్వాత తరువాతి సాధారణ వారం రోజుల్లో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి పట్టును కొనసాగించింది. ఇప్పటివరకు రూ.920 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా ఇప్పటికే దంగల్ ను దాటేసి బాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మరి ఈ వారాంతం సహాయంతో ఈ సినిమా మంచి ఊపుని కొనసాగిస్తుందని అంచనా వేస్తున్నారు.
వచ్చే వారాంతంలో శివరాత్రి పండగ వస్తుండటంతో ఆ వారాంతంలో ఈ చిత్రం త్వరలోనే 1000 కోట్ల గ్రాస్ మార్కును దాటడం ఖాయమని అంటున్నారు. ఈ బ్లాక్ బస్టర్ తో షారుఖ్ ఖాన్ అద్భుతమైన పునరాగమనం చేసి ప్రేక్షకులకు థియేటర్లకు రప్పించి బాలీవుడ్ డల్ స్టేజ్ కు ముగింపు పలికారు. ఈ చిత్రంలో జాన్ అబ్రహం, దీపికా పదుకొనె కూడా ముఖ్య పాత్రల్లో నటించారు.
కార్తిక ఆర్యన్ నటించిన షెహజాదా వంటి పలు బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పఠాన్ అసాధారణ రన్ ను చూసి తమ విడుదలలను వాయిదా వేసుకున్నాయి. అందుకే ఈ షారుక్ ఖాన్ స్టార్టర్ బాక్సాఫీస్ వద్ద పోటీ లేకుండా రెండు వారాలు ఆడింది. ఈ చిత్రం ప్రతి ప్రాంతంలోనూ హిందీ సినిమాకు కొత్త బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసింది.