షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం తగ్గకపోగా ఒకదాని తర్వాత ఒకటి కలెక్షన్ల బెంచ్ మార్క్ ను సాధిస్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ పఠాన్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల క్లబ్ లో చేరే అంచున ఉంది.
సెన్సేషనల్ ఫస్ట్ వీకెండ్ తర్వాత వీక్ డేస్ లో కూడా ఈ సినిమా మంచి పట్టును కొనసాగించింది. ఇప్పటివరకు 750 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా ఇప్పటికే దంగల్ (చైనా కలెక్షన్స్ మినహాయించి) దాటి బాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
ఇప్పుడు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల క్లబ్ లో చేరడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ప్రతి ప్రాంతం లోనూ హిందీ సినిమాకు కొత్త బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసి ఎవరూ ఊహించని స్థాయిలో రికార్డులు సృష్టిస్తుంది.
ఈ బ్లాక్ బస్టర్ తో షారుఖ్ ఖాన్ అద్భుతమైన పునరాగమనం చేయడం మాత్రమే కాక చాలా కాలం తర్వాత ప్రేక్షకులకు థియేటర్లకు రప్పించి బాలీవుడ్ డల్ స్టేజ్ కు ముగింపు పలికారు. ఈ చిత్రంలో జాన్ అబ్రహం, దీపికా పదుకొనె కూడా ముఖ్య పాత్రల్లో నటించారు.
పఠాన్ 2023 గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు అంటే జనవరి 25 న హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో విడుదలైంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ సమర్పణలో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో పఠాన్ సినిమా రూపొందింది. కాగా అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ తో ఈ చిత్రం విడుదలకు ముందే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది.