మారుతి దర్శకత్వంలో హీరో గోపీచంద్,హీరోయిన్ రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న సినిమా”పక్కా కమర్షియల్”. ఈ సినిమా జూలై 1, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంది సినిమా టీమ్. అందులో భాగంగా ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. హీరో గోపీచంద్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుందని, దీంతో పాటు రాశీ ఖన్నా రోల్ కూడా ఆకట్టుకునేలా ఉంటుందని సమాచారం.
ఇక అది అలా ఉంటే ఈ సినిమా టిక్కెట్ల ధరల విషయంలో టీమ్ ఓ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాకు తెలంగాణలో సింగిల్ థియేటర్‌లో రూ.100 కాగా మల్టీప్లెక్స్‌లో రూ.160గా ఉండునుంది. ఇక అటు ఆంధ్రలో సింగిల్ థియేటర్‌లో రూ.100 కాగా మల్టీప్లెక్స్‌లో రూ.150గా ఉండనుందని ప్రకటించారు.
అయితే ఇంత తక్కువ రేట్లకు ఈ మధ్య కాలంలో ఏ సినిమా విడుదల కాలేదు. దీంతో ఈ విషయంపై నెటిజన్స్ చిత్ర బృందాన్ని అభినందిస్తున్నారు. వచ్చే అన్ని సినిమాలకు ఇదే రేట్లు కొనసాగిస్తే మంచిదని, ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇండస్ట్రీ మరియు ట్రేడ్ వర్గాలు.
ఈ రోజు జరిగే ప్రి రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు. దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఓ పాటను వదిలింది టీమ్. అందాల రాశి అంటూ సాగే ఈ పాట కూడా మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది. జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా,కృష్ణ కాంత్ రాసిన ఈ పాటను శ్రీ చరణ్, రమ్య బెహరా పాడారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక కరోనా పలుమార్లు దాడి చేయడం వలన అన్ని సినిమాల లాగే ఈ సినిమా విడుదల అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ప్రతి రోజు పండగే లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ కలిసి, బన్నీ వాసు నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు మారుతి.సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ చిత్రానికి జేక్స్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. పక్కా కమర్షియల్ టైటిల్‌కు అటు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇటు సాధరణ ప్రేక్షకుల వరకు చక్కని క్రేజ్ పెరిగింది సినిమా పై.అంతేకాదు టీజర్,ట్రెయిలర్ లు కూడా టైటిల్ కి తగ్గట్టు అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్న అంచనాలను పెంచింది.
ఇక గోపీచంద్ చివరిగా హీరోగా చేసిన సినిమా సీటీమార్. సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద పరవాలేదు అనిపించుకుంది.ఇక మారుతి తన తదుపరి చిత్రాన్ని ప్రభాస్‌తో చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.హారర్ కామెడీగా రూపొందుతున్న ఈ సినిమాకి “రాజా డీలక్స్” అన్న టైటిల్ అనధికారికంగా చక్కర్లు కొడుతోంది.