ఇటీవల తెలుగు సినిమా పరిశ్రమలో వచ్చిన కొన్ని సినిమాల విషయంలో ప్రమోషన్స్ టైం లో కొన్ని సినిమాలకు సంబంధించి ఆ ఎపిసోడ్ బాగుంది ఈ ఎపిసోడ్ బాగా వచ్చింది, తప్పకుండా అది మిస్ అవ్వకుండా చూడండి అంటూ ఆయా మూవీ టీమ్స్ వాటి గురించి చెప్పడం చూస్థుంటాం.
అయితే ముఖ్యంగా తాజాగా వచ్చిన కొన్ని సినిమాల యొక్క క్లైమాక్స్ సీన్స్ బాగా వచ్చాయని కొన్ని సినీ టీమ్స్ చెప్పుకువచ్చాయి. ఇటీవల నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా విజయశాంతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ క్లైమాక్స్ ఎంతో అద్భుతంగా వచ్చిందని, అటువంటి సీన్స్ కి ఏ హీరో కూడా ఒప్పుకోరని టీమ్ వెల్లడించింది. అయితే సినిమా రిలీజ్ తరువాత ఆ క్లైమాక్స్ సీన్ అంతగా రెస్పాన్స్ అందుకోలేదు.
అలానే ఇటీవల రామ్ చరణ్ హీరోగా శంకర్ తీసిన గేమ్ చేంజర్ మూవీ యొక్క క్లైమాక్స్ విషయమై కూడా మంచి హైప్ మొదట్లో నడిచింది. అయితే రిలీజ్ అనంతరం అది కూడా ఆకట్టుకోలేదు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీస్ యొక్క క్లైమాక్స్ విషయమై కూడా రిలీజ్ కి ముందు కొంత క్రేజీ బజ్ నడించింది.
కానీ అవి రెండూ కూడా ఆడియన్స్ ని పెద్దగా అలరించలేదు. ఆ విధంగా క్లైమాక్స్ సీన్స్ అలా ఉంటాయి అదిరిపోతాయి అంటూ ఇటీవల వచ్చిన హైప్స్ తో ఏ ఒక్క సినిమా క్లైమాక్స్ సీన్స్ కూడా ఆకట్టుకోకపోవడం ఆశ్చర్యం. అలానే ఒకటి రెండు సినిమాల క్లైమాక్స్ ల పై ఆడియన్స్ పెదవి విరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి.