Homeసినిమా వార్తలుఓటీటీ ఆ ధియేటర్లా ఎవరిది తప్పు?

ఓటీటీ ఆ ధియేటర్లా ఎవరిది తప్పు?

- Advertisement -

గత నాలుగేళ్లుగా ఓటీటీ ఇండస్ట్రీ ఎలా వ్యాప్తి చెందింది అనేది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే.ముఖ్యంగా కరోనా వల్ల ధియేటర్ లు మూతబడటం వలన అమెజాన్ ప్రైమ్,. నెట్ ఫ్లిక్స్, జీ 5, మరియు తొలి తెలుగు ఓటీటీ యాప్ గా వచ్చిన ఆహా ఇలా చాలా ఆప్షన్ లు ప్రేక్షకులకి దగ్గరయ్యాయి.

కొన్ని పెద్ద సినిమాలతో పాటు, చాలా చిన్న సినిమాలు ఓటీటీ లలో విడుదల అయి తమ నష్టాలను కాస్త తగ్గించుకున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కరెంట్ పోయినపుడు కొవ్వొత్తి వెలుగు సహాయం చేసింది అని ఎల్లకాలం ఆ వెలుగులోనే ఉండలేము కదా.ఇప్పుడు అదే పరిస్తితి తెలుగు సినీ నిర్మాతలకు వచ్చి పడింది.

ధియేటర్ లలో సినిమాలు చూడటం అనే అలవాటు తప్పడంతో ఫ్యామిలి ప్రేక్షకులు అంత సులభంగా ధియేటర్ లకు రావట్లేదు ఇప్పుడు. కేవలం హీరోల అభిమానులు లేదా సినీ ప్రేమికులు మాత్రమే ధియేటర్ లకు తరలి వస్తున్నారు.అయితే ఇక్కడ తప్పు ఒప్పులు లెక్కించే బదులు ఏం చేస్తే ప్రేక్షకులు ధియేటర్ ల వద్దకు వస్తారో అలోచించి, ఆ దిశగా ప్రణాళికలు గనక సినిమా నిర్మాతలు కలిసి నిర్దేశిస్తూ నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది.

READ  నాని మార్కెట్ మీద డౌట్ పడుతున్న ప్రోడ్యూసర్ లు

ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా అప్డేట్ అయి ముందుకు వెళ్తేనే యే ఇండస్ట్రీ అయినా సక్సెస్ అవుతుంది. ఓటీటీ వచ్చిన కొత్తలో తెలుగు సినిమా నిర్మాతలు అందరూ దాదాపు ఒక మాట మీద ఉండి ధియేటర్ రిలీజ్ కీ, ఓటీటీ రిలీజ్ కి మధ్య యాభై రోజులు, లేదా కనీసం ఆరు వారాలు అయినా గ్యాప్ ఉండేలా చూసుకున్నారు.

కానీ ఇప్పుడు ఆ పరిస్తితి లేదు, కేవలం నాలుగు వారాల లోపే పెద్ద సినిమాలు ఫోన్ లలోకి వచ్చేస్తుంటే ఎంత మంది ఆ సినిమాలను చూడటానికి ధియేటర్ కు వస్తారు? కొన్ని సినిమాలు అయితే మరీ అన్యాయంగా 3 వారాల లోపే ఓటీటీ లోకి వచ్చేశాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయిన సినిమాలు అలా తొందరగా ఓటీటీ లలో వచ్చాయి అంటే ఒక అర్థం ఉంది కానీ హిట్ సినిమాలు కూడా అలా చేస్తే ఏమాత్రం మంచి పద్ధతి కాదు.

ఇక టికెట్ హైక్ ల సంగతి సరే సరి. ప్రభుత్వం వారు అత్యవర పరిస్థితిలో ఫలానా ధరకు పెంచుకోవచ్చు అని అనుమతి ఇస్తే ఆ టికెట్ రేట్లనే రెగ్యులర్ చేసేసి, ఆ రేట్ ల మీద మరో యాభై రూపాయల వరకూ పెంచుకోవటానికి ప్రత్యేక అనుమతి తెచ్చుకోవడం విడ్డూరం.కాబట్టి అటు ఎక్జిబిటర్ ల తో పాటు, పెద్ద నిర్మాతలు, పంపిణీ దారులు ఒక మాట పై ఉండి, యే సినిమాలకు ఎంత రేట్ అనేది చర్చించుకుని కొన్ని నిర్ణయాలు తీసుకుంటే వారికే మంచిది.

Follow on Google News Follow on Whatsapp

READ  Box-Office అంటే సుందరానికీ నాలుగవ రోజు కలెక్షన్ లు పెద్ద షాక్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories