Homeసినిమా వార్తలుOTT Release: విరాట పర్వం ఓటిటి రిలీజ్ ఎప్పుడంటే..

OTT Release: విరాట పర్వం ఓటిటి రిలీజ్ ఎప్పుడంటే..

- Advertisement -

రెండు వారాల క్రితం థియేటర్లలో రానా – సాయి పల్లవిల విరాట పర్వం సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఏడాదిన్నరగా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల కోసం వెయిట్ చేస్తున్న విరాట పర్వానికి చిత్ర యూనిట్ ఎట్టకేలకు జూన్ 17 న మోక్షం కలిగించారు.

అసలైతే విరాట పర్వం ఓటిటిలోనే రిలీజ్ అవుతుందని ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా అనుకున్నా చివరికి విరాట పర్వం సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. అయితే థియేటర్స్ లో విడుదలైన విరాట పర్వం డాక్యుమెంటరిగా ఉంది అని, ఈ సినిమా ఓటిటి లో అయితే పర్ఫెక్ట్ గా ఉండేది అని కొంత మంది ప్రేక్షకులు అభిప్రాయ పడ్డారు.ఇక జూన్ 17 న విడుదలైన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి వస్తుందా అని థియేటర్లలో చూడని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సాయి పల్లవి కోసం థియేటర్స్ కి వెళ్లలేని వారు ఇంట్లో ఓటిటిలో విరాట పర్వం చూడాలని అనుకుంటున్నారు.

అయితే విరాట పర్వం ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది తెలిసింది. ప్ర‌ముఖ ఓటీటీ ఛానెల్ నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ ఓటీటీ హ‌క్కుల‌ను 15 కోట్ల‌కు చేజిక్కించుకుంద‌ట‌.ఈ మేరకు విరాట పర్వం సినిమా నెట్ ఫ్లిక్స్ లో జూలై 1న విడుదల కానుందని, అందులోనూ మూడు భాషల్లో అంటే తెలుగు,తమిళ,మలయాళం లో విడుదల అవుతుందని సమాచారం. మరి ఓటిటిలో విడుదల అయిన తరువాత అయినా విరాట పర్వం సినిమాకి మంచి స్పందన వస్తుందని ఆశిద్దాం.

READ  బ్రహ్మాస్త్ర ట్రైలర్ ఎలా ఉందంటే

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories