Homeసినిమా వార్తలుNetflix: సబ్స్క్రిప్షన్ ధర 50 శాతం తగ్గించిన ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్

Netflix: సబ్స్క్రిప్షన్ ధర 50 శాతం తగ్గించిన ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్

- Advertisement -

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ భారత దేశంతో సహా 100కు పైగా దేశాల్లో తన సబ్స్క్రిప్షన్ ధరలను గణనీయంగా తగ్గించాలని నిర్ణయించింది. ఈ ఓటీటీ పోర్టల్ కు భారత దేశంలో గణనీయమైన సంఖ్యలో చందాదారులు ఉన్నారని, ధరలను తగ్గిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం ఖచ్చితంగా ఆ సంఖ్యను పెంచుతుందని భావిస్తున్నారు.

మార్చి 2023 తో ఈ సంవత్సరంలో ముగిసిన మూడు నెలలకు నెట్ ఫ్లిక్స్ ప్రపంచ నికర ఆదాయం చూసుకుంటే 1,305 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 107 కోట్లు) పడిపోయింది, ఇది అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 18% తగ్గింది.

ఇంతకు ముందు నెలకు రూ.199 గా ఉన్న నెట్ ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ ఇప్పుడు రూ.149 కే లభిస్తుంది. దీంతో పాటు బేసిక్ సబ్స్క్రిప్షన్ ధర రూ.499కి బదులు రూ.199గా ఉండబోతుంది. ఇతర ఓటీటీ ప్లాట్ ఫామ్ లతో పోల్చి చూస్తే నెట్ ఫ్లిక్స్ ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. వాస్తవానికి నెట్ ఫ్లిక్స్ యొక్క నెలవారీ సబ్స్క్రిప్షన్ ధరలు కొన్ని ఇతర ఓటీటీ పోర్టల్స్ వార్షిక సబ్స్క్రిప్షన్ కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.

READ  Vaathi/Sir: ధనుష్ సార్ సినిమా [వాతి ] ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అండ్ రిలీజ్ పార్ట్నర్

తాజాగా తీసుకున్న ఈ ధరల తగ్గింపు నిర్ణయం నెట్ ఫ్లిక్స్ కి చాలా బాగా చేస్తుంది అనే చెప్పాలి. మరియు ఈ గ్లోబల్ దిగ్గజం ఖచ్చితంగా ఈ నిర్ణయంతో వారి సబ్స్క్రిప్షన్ బేస్ ను పెంచుకుంటుంది. ఆసియా, యూరప్, లాటిన్ అమెరికా, సబ్ సహారా ఆఫ్రికా, మధ్య ప్రాచ్యంలోని మొత్తం 116 దేశాల్లో నెట్ ఫ్లిక్స్ యొక్క ధరలు తగ్గాయి.

Follow on Google News Follow on Whatsapp

READ  Ranga Marthanda: రంగమార్తాండ రిలీజ్ తర్వాత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories