HomeOTT సమీక్షలుOTT: హైవే రివ్యూ

OTT: హైవే రివ్యూ

- Advertisement -

నటీనటులు: ఆనంద్ దేవరకొండ, అభిషేక్ బెనర్జీ, మానస రాధాకృష్ణన్, సయామీ ఖేర్, సురేఖవాణి తదితరులు.

దర్శకత్వం కేవీ గుహన్

నిర్మాత: వెంకట్ తలారి

మ్యూజిక్: సైమన్ కే కింగ్

సినిమాటోగ్రఫి: కేవీ గుహన్

ఎడిటర్: తమ్మిరాజు

ఒటిటీ ప్లాట్ ఫామ్: ఆహా

రేటింగ్: 2.5/5

విజయ్ దేవరకొండ తమ్ముడుగా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ఆనంద్ దేవరకొండ.. కొత్త రకమైన ప్రయత్నాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కెమెరా మెన్ గా పరిశ్రమలో ఒక వెలుగు వెలిగి.. 2020లో కళ్యాణ్ రామ్ తో 118 వంటి హిట్ సినిమాని అందించిన కేవి గుహాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

కథ:

హైద‌రాబాద్ సిటీలో ఓ సైకో కిల్ల‌ర్ దాస్ (అభిషేక్ బెనర్జీ) ఒంటిరిగా అమ్మాయి కనపడితే నిర్మాన్యుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి అతి క్రూరంగా చంపేస్తుంటాడు. ఐదు హత్యలు చేసిన ఆ సీరియల్ కిల్లర్ ని పట్టుకునేందుకు ఏసీపి ఆశా భరత్(సయామీ ఖేర్) ప్ర‌య‌త్నిస్తుంటుంది. మ‌రోవైపు ఫొటోగ్రాఫ‌ర్‌ విష్ణు (ఆనంద్ దేవరకొండ) ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ప్రెండ్ స‌ముద్రం (సత్య) తో క‌లిసి వైజాగ్ నుండి బెంగ‌ళూరు హైవేలో బ‌య‌లుదేరుతాడు. మంగ‌ళూరులో ఉన్న తండ్రిని క‌లుసుకోవ‌డానికి తుల‌సి (మానస రాధాకృష్ణన్) ఒంట‌రిగా బ‌య‌లుదేరుతుంది. మ‌ధ్యలో బ‌స్ మిస్ కావ‌డంతో ఆమెకు విష్ణు లిఫ్ట్ ఇస్తాడు. ఆ పరిచయం ఎక్కడికి దారి తీసింది?తులసి, విష్ణులకు ఆ సైకో కిల్లర్ ఎదురైతే అప్పుడు ఏమౌతుంది…విష్ణు అతన్ని ఎలా ఎదురుకుంటాడు అనేది మిగతా కథ.

READ  Raviteja: సహజమైన సెట్లతో రూపొందిన రామారావు ఆన్ డ్యూటీ

విశ్లేషణ:

రెగ్యులర్ గా సైకో కిల్లర్ చిత్రాలు ఒక ఫార్ములా ప్రకారం నడుస్తూ ఉంటాయి. ఓ సీరియల్ కిల్లర్ వరస హత్యలు చేయడం.. అతన్ని పట్టుకోవటానికి పోలీస్ లు ప్రయత్నించడం.. ఈలోగా హీరోయిన్ ఆ కిల్లర్ చేతిలో చిక్కడం, చివరికి హీరో ఆ సైకో కిల్లర్ నుంచి హీరోయిన్ ను రక్షించడం ఇలా సాగుతూంటాయి. ఈ సినిమాలో తూచ తప్పకుండా అదే వ్యవహారం నడిచింది. మచ్చుకైనా ఒక్కటంటే ఒక్క దగరైనా ప్రేక్షకుడి ఊహకి అందని విధంగా సినిమా ఉండదు. ఏదో అలా వెళ్తూ ఉంటుంది. ఎక్కడ కూడా ఎలాంటి మలుపులు లేదా అడ్డంకులు లేకుండా హైవే పై అలా తాపీగా ప్రయాణం చేసినట్లు కథనం సాగుతుంది. ఇలాంటి జానర్ సినిమాలలో ఏదో ఒక కొత్త దనం చూపితే కానీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం వీలు కాదు. ఈ సినిమాలో అసలు ప్రేక్షకులని షాక్ కు గురి చేసే అంశాలు ఏమాత్రం కనపడవు. అలాగే సైకో కిల్లర్ పాత్ర ఏమయినా ఆసక్తికరంగా ఉంటుందా అంటే అదీ లేదు. ఒక థ్రిల్లర్ సినిమాకి కావాల్సిన స్పీడ్, టెన్షన్ ఏది లేదు. క్లైమాక్స్ లో వచ్చే పులి ఎపిసోడ్ అయితే మరీ దారుణంగా ఉందని చెప్పచ్చు.

ఇలాంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కీలకం. సైమన్ కే కింగ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు సరిగ్గా సరిపోయింది. పాటలు ఈ సినిమాలో అనవసరం అని చెప్పచ్చు. సినిమాటోగ్రఫీతో పాటు దర్శకత్వం కూడా చేసిన కేవీ గుహన్ కెమెరా వర్క్ వరకూ బాగా పనితనం చూపించినా.. దర్శకుడుగా మాత్రం అనుకున్నంత స్థాయిలో ప్రతిభను చూపలేకపోయారు. ఎడిటింగ్ కూడా ఇంకా బాగుండాల్సింది.

ఇక నటీనటుల విషయానికి వస్తే ఆనంద్ దేవరకొండ , హీరోయిన్ మానస రాధా కృష్ణన్ ఇద్దరూ మంచి నటనను కనబరిచారు. సైకో కిల్లర్ పాత్రలో అభిషేక్ బెనర్జీ బాగా చేశారు. సయామీ ఖేర్ పోలీస్ పాత్రకు సెట్ అయ్యింది. అయితే ఆమె పాత్ర చిత్రణ ఇంకాస్త బాగుండాల్సింది. మిగతా నటీనటులు పరవాలేదు.

READ  సీతారామం సినిమా ఒక వ్యసనం లాంటిది - హను రాఘవపూడి

చివరిగా.. మంచి థ్రిల్లర్ కి కావాల్సిన అన్ని అంశాలు ఉన్నప్పటికీ.. తెరకెక్కించడంలో లోపాల వలన ఒక రొటీన్ థ్రిల్లర్ మిగిలింది హైవే.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories