గత సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమకి, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య జరిగిన టికెట్ రేట్ల రగడ అందరికీ తెలిసిన విషయమే.
వకీల్ సాబ్ సమయంలో AP ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్‌ను ఇబ్బంది పెట్టడానికి G.O విడుదల చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం C, D సెంటర్లలో ధరలు 5,10,20 అని కేటాయిస్తే, పరిశ్రమ పెద్దలు మరియు థియేటర్ ల యాజమాన్యం వారు రివైజ్డ్ జి.ఓ కోసం అభ్యర్థించారు.ఎట్టకేలకు ప్రభుత్వం కొత్తజి.ఓ విడుదల చేసింది. దాంతో ఇండస్ట్రీ సంతోషం వ్యక్తం చేసింది,ఆ తరువాత రిలీజ్ అయిన పెద్ద సినిమాలకు ప్రత్యేక టిక్కెట్ పెంపుకు ధరఖాస్తు చేసుకుని అనుమతి తెచ్చుకోవడం ఆనవాయితీగా మారింది.ఆ క్రమంలో వరుసగా సినిమాలు రిలీజ్ అవడం ఆయా సినిమాల థియేట్రికల్ రన్‌ను ప్రభావితం చేసింది.అలా వరుస పెట్టి సినిమాలు విడుదలైనప్పుడు ఒక దానికి ఒకటి ప్రభావితం అవడం చాలా సాధారణం, ఖచ్చితంగా ప్రేక్షకులు అన్ని చిత్రాలను చూడలేరు కాబట్టి కొన్ని సినిమాలు ఈ వరుస విడుదల వల్ల దెబ్బతిన్న మాట వాస్తవం.
అదే సమయంలో మేము G.O ధరలతో వెళ్తున్నామని, దయచేసి మా సినిమాని చూడండి అని చెప్పడం ద్వారా దిల్ రాజు కొత్త ప్రచార అజెండాను ప్రారంభించాడు. దాన్నే మరి కొన్ని సినిమాలకు ఆయా చిత్ర బృందం ప్రచారం చేసుకోవడం ప్రారంభించాయి.అయితే దీన్ని సాకుగా చూపిస్తూ ఆ రోజు జగన్ చేసిన పనిని రామ్ గోపాల్ వర్మ తో పాటు కొంత మంది కుహానా మేధావులు మద్దతు ఇవ్వడం మొదలు పెట్టారు.అయితే వాదనలో ఏ మాత్రం తర్కం కానీ, హెతు భద్ధత కానీ లేవనే చెప్పాలి. ఎందుకంటే పాత. జీఓ ప్రకారం రేట్లు అనగా 5,10,20 రూపాయలకు టికెట్ లు అమ్మితే థియేటర్ ల యాజమాన్యానికి ఏ మాత్రం గిట్టుబాటు అవదు.కనీసం ఖర్చులను కూడా వారు తిరిగి పొందలేరు. వకీల్ సాబ్ సమయంలో AP ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిన పని వల్ల ఆ సమయంలో పరిశ్రమ చాలా నష్టపోయింది.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్తగా వచ్చిన ఈ టికెట్ రేట్ల వివాదం తెలంగాణ లో కానీ ఆంధ్రలో కాదు.మార్చిలో కొత్త జీఓ వచ్చినప్పటి ఉంచి ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్ల మీద ఎవరూ కంప్లైంట్ లు ఇవ్వటం జరగలేదు. అవసరం అయిన సినిమాలకు టికెట్ రేట్లు ప్రభుత్వ అనుమతితో పెంచుకుంటున్నారు. ఎటొచ్చీ సమస్య అంతా తెలంగాణలోనే, అత్యవసర పరిస్థితుల్లో వాడుకునే వెసులుబాటు కలిగిస్తూ ప్రభుత్వం అనుమతిస్తే ఆ రేట్లనే రెగ్యులర్ ధరలుగా నియమించి మళ్ళీ వాటి పై యాభై లేదా వంద రూపాయలు పెంచుకోవాలనే అత్యాశకు పోతున్నారు. ఆ ప్రయత్నం కొన్ని రొటీన్ బిగ్ సినిమాలకు, మరియు కొన్ని మీడియం బడ్జెట్ సినిమాలు దెబ్బ తినడంతో మళ్ళీ తక్కువ రేట్లకే సినిమా అంటూ కొత్త ప్రచారం మొదలు పెట్టారు. కనుక ఈ వివాదం అంతా తెలంగాణ లోనే కాబట్టి సో కాల్డ్ మేధావులు ఈ వంకతో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విషయంలో వెనకేసుకు రావడం మానుకుంటే మంచిది.