పూరీ జగన్నాథ్ నిన్న మొన్నటి వరకూ కమర్షియల్‌గా వ్యవహరించని వ్యక్తిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు. ఆయన జీవితంలో ఎందరినో నమ్మి సంపాదించిన డబ్బులో చాలా వరకు పోగొట్టుకున్నారు. ఆయన ఆ అనుకొని ఆర్థిక సమస్యలకు గురైనప్పటి నుండి పరిస్థితులు మారాయి. ఇప్పుడు పూరీ గతంలో కంటే ఎక్కువ మనీ మైండెడ్ మనిషిగా మారారు.
కొంత కాలంగా పూరీ జగన్నాథ్ ను గమనిస్తున్న కొందరు మాత్రం పూరీ చాలా మారిపోయారని, డబ్బు విషయంలో కమర్షియల్‌గా, అనైతికంగా మారారని ఫిర్యాదు చేస్తున్నారు.
పూరీ జగన్నాథ్ తాజా చిత్రం లైగర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దర్శకుడిగా ఈ సినిమా ఆయనకు చాలా చెడ్డ పేరు తెచ్చింది. కానీ తన కెరీర్ లో ఇంత భారీ ప్లాప్ సాధించడం ఇదే మొదటిసారి కాదు. పూరి ఏ సమయంలోనైనా కమ్ బ్యాక్ ఇవ్వగల దర్శకుడు. అసలు విషయం ఫ్లాప్ సినిమా కాదు, డబ్బు విషయంలో అతని వైఖరిలో వచ్చిన మార్పు ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది.
లైగర్ సినిమా వల్ల భారీ నష్టాలను చవిచూసిన పంపిణీదారులకు పూరీ జగన్నాథ్ ఇంకా కొంత పరిహారం తిరిగి ఇవ్వలేదు. అయితే, ఇది అతని స్వంత నిర్ణయం, దాని పై ఎవరూ కూడా వ్యాఖ్యానించలేరు. కానీ సినిమాకి పని చేసిన వారికి పారితోషికం చెల్లించడం అతని బాధ్యత కదా.
తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం, ఆయన ఇంకా హీరో విజయ్ దేవరకొండకు రెమ్యూనరేషన్ చెల్లించలేదట. ఇది నిజమైతే మటుకు ఎంత మాత్రం సరైన విషయం కాదు. విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కోసం శారీరకంగా ఎంతో కష్ట పడ్డారు. అంతే కాకుండా వివులవైన సమయాన్ని కూడా వెచ్చించి చిత్తశుద్ధితో పని చేసారు, మరి అందుకు ప్రతిఫలంగా రావాల్సిన ఫలితం రాకపోగా ఇలా పారితోషికం కూడా అందకపోవడం చాలా దారుణం.
ఇక తాజాగా లైగర్ సినిమాకు పెట్టిన పెట్టుబడికి సంబంధించి పూరీ, ఛార్మీలకు ఈడీ నోటీసులు కూడా అందజేసింది. సినిమా పెట్టుబడిలో రాజకీయ నాయకులు నల్లధనం ఉందని ఆరోపించారు. ఇలా లైగర్ సినిమా వల్ల ఇన్ని రకాల వివాదాలతో పూరీ తన సిబ్బంది దగ్గర మాత్రమే కాకుండా, ఇతరుల పట్ల చూపుతున్న వైఖరి వల్ల కూడా చెడ్డ పేరు తెచ్చుకున్నారు.