Homeసినిమా వార్తలుబుల్లితెర పై RRR Vs KGF 2

బుల్లితెర పై RRR Vs KGF 2

- Advertisement -

ఈ ఏడాది భారతీయ సినిమా చరిత్ర లోనే ఎప్పుడూ కనీవినీ ఎరుగని రికార్డులు నమోదయ్యాయి. ఖచ్చితంగా ఇది మన దేశ చలనచిత్ర చరిత్రలో నిలిచిపోయే సంవత్సరం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలు వచ్చాయి.. ఆ రెండు కూడా దక్షిణ సినీ పరిశ్రమకి చెందిన సినిమాలవ్వడం మరింత గర్వ కారణంగా చెప్పుకోవచ్చు. ఓ పక్క బాలీవుడ్ సినిమాలు వంద కోట్ల వసూలు చేయాలి అంటే కిందా మీద పడుతున్న సమయంలో వెయ్యి కోట్లకు పైగా సాధించిన సినిమాలు గా కేజీఎఫ్ మరియు ఆర్ ఆర్ ఆర్ సినిమాలు చరిత్ర సృష్టించాయి.

ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇక ఓటీటీలో విడుదలైన తరువాత కూడా అంతే స్థాయిలో ఈ రెండు సినిమాలు సందడి చేశాయి. కేజీఎఫ్ మరియు ఆర్ ఆర్ ఆర్ సినిమా లు ఇప్పటికి కూడా పలు దేశాల్లో ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆర్ ఆర్ ఆర్ ఓటీటీ ద్వారా సాధించిన ఖ్యాతి గురించి మాటల్లో చెప్పలేం.

హాలీవుడ్ స్థాయిలో మన ఆర్ ఆర్ ఆర్ సినిమాకు విశేష స్పందన లభించింది. థియేట్రికల్ రన్ పరంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా కలెక్షన్లను కేజీఎఫ్ 2 దాటిన విషయం తెలిసిందే. కేజీఎఫ్ 2 అన్ని భాషల్లో అద్భుతంగా ప్రదర్శింపబడి భారీ వసూళ్లతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ ఏడాది నెం.1 సినిమా గా నిలిచింది. అయితే ఓటీటీ లో మాత్రం ఆర్ ఆర్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా విశేష స్పందన లభించడంతో ఎక్కడికో వెళ్లిపోయింది.

READ  ది వారియర్ కు సీక్వెల్ ఉంటుంది అన్న దర్శకుడు లింగుస్వామి

ఇప్పుడు ఈ రెండు సినిమాలు మరోసారి ఒకటితో ఒకటి తలపడేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ మరియు ఓటీటీ సందడి పూర్తి అయిన తర్వాత శాటిలైట్ టెలికాస్ట్ కు సిద్ధం అయ్యాయి. ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాటు కేజీఎఫ్ 2 కూడా బుల్లి తెరలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు సమాచారం.

ఆర్ ఆర్ ఆర్ సినిమాను హిందీ లో జీ సినిమా టెలికాస్ట్ చేయనుండగా.. తెలుగు తో పాటు ఇతర దక్షిణ భాషల్లో స్టార్ సంస్థ టెలికాస్ట్ చేయబోతున్నారు. తెలుగులో స్టార్ మా ఛానల్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా త్వరలో ప్రసారం కాబోతుంది. ఇప్పటికే అందుకు సంభందించిన ప్రచారం స్టార్ మా ఛానల్ మొదలు పెట్టింది.ఇక కేజీఎఫ్ 2 ను అన్ని భాషల హక్కులను జీ సంస్థ దక్కించుకుంది. ఈ మేరకు తెలుగు లో జీ తెలుగు వారు అతి త్వరలోనే కేజీఎఫ్ 2ను టివిలో ప్రసారం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక టీఆర్పీ రేసులో ఆర్ ఆర్ ఆర్ గెలుస్తుందా లేక కెజీఫ్ 2 గెలుస్తుందా అనేది చూడాలి.

READ  థాంక్యూ చిత్రంతో దిల్ రాజుకు తీరని నష్టాలు

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories