Homeసినిమా వార్తలుఓకే ఒక జీవితం సినిమా స్పెషల్ షోలకు అద్భుతమైన స్పందన

ఓకే ఒక జీవితం సినిమా స్పెషల్ షోలకు అద్భుతమైన స్పందన

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. అది సినిమాలు తీసే కథల్లో కావచ్చు, లేదా సినిమాను ప్రమోట్ చేసే విషయంలో కావచ్చు. సమయాన్ని బట్టి మారడమే కదా అందరూ చేయాల్సింది. ఇండస్ట్రీ కూడా అదే చేస్తుంది. ప్రస్తుతం స్పెషల్ షో స్క్రీనింగ్‌లు అనేవి చిన్న సినిమా లేదా మీడియం -బడ్జెట్ సినిమాలకి నిజంగానే ఒక అద్భుతమైన ప్రచార వ్యూహంగా మారాయి. సినిమా విడుదలకు ముందే చాలా బాగుంది అన్న మౌత్ టాక్ రావడం చిన్న సినిమాలకి బాగా కలిసి వచ్చే అంశం. ఇటీవలే విడుదలైన మేజర్ మరియు చార్లీ 777 వంటి సినిమాలకి కూడా ఇలాగే విడుదలకు కొన్ని రోజుల ముందు స్పెషల్ షో స్క్రీనింగ్‌లను విజయవంతంగా అమలు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం సినిమాకు కూడా అదే పద్ధతిలో స్పెషల్ షోలు నిర్వహించబడ్డాయి. కాగా ఈ చిత్ర బృందానికి ఈ స్పెషల్ షో వల్ల మంచే జరిగినట్లు కనిపిస్తుంది. ఒకే ఒక జీవితం స్పెషల్ షోల నుండి వచ్చిన స్పందన అద్భుతంగా ఉంది, సినిమా చూసిన వారు హృదయాన్ని తాకే విధంగా ఉందని అంటున్నారు.

సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా కాలం తర్వాత తాము చూసిన ఎమోషనల్ మూవీస్‌లో ఈ సినిమా ఒకటని అన్నారు. కాగా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో అమలా అక్కినేని నటించిన సంగతి తెలిసిందే. ఆమె నటనకు అద్భుతమైన ప్రశంసలను దక్కించుకున్నారు.

READ  పవన్ కళ్యాణ్ హారి హర వీర మల్లు షూటింగ్ ఈసారైనా మొదలవుతుందా?

ఇక ఈ స్పెషల్ షోకు హాజరైన నాగార్జున మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఇంకా తనను ఉక్కిరిబిక్కిరి చేస్తుందని తెలిపారు, అంతే కాకుండా సినిమా చూస్తుంటే మా అమ్మ గురించి ఆలోచించేలా చేసిందిని చెప్తూ.. ఇది నిజంగా అందమైన సినిమా అని అన్నారు.

ఇక ఇదే స్క్రీనింగ్ కు అఖిల్ అక్కినేని కూడా వచ్చారు. ఆయన శర్వానంద్‌కి, దర్శకుడు శ్రీ కార్తీక్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రియదర్శి పులికొండ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం నాకు మాటలు రావడం లేదు. అసలు నేను అనుభవిస్తున్న భావోద్వేగాలను వర్ణించడానికి నా దగ్గర పదాలు కూడా లేవు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన అందమైన చిత్రమిది” అన్నారు.

దర్శకుడు శ్రీకార్తీక్‌ మాట్లాడుతూ ‘ఒకే ఒక జీవితం’ సినిమా ప్రజల హృదయాలను హత్తుకుందని చెప్పారు. తన తల్లి గౌరవార్థం ఈ సినిమా తీశానని, ఈ సినిమా చేస్తున్నప్పుడు తాను ఎలాంటి భావోద్వేగానికి గురయ్యానో, అదే భావోద్వేగానికి ప్రేక్షకులు కూడా గురవుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఒకే ఒక జీవితం రేపు సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో రీతూ వర్మ, వెన్నెల కిషోర్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు.

Follow on Google News Follow on Whatsapp

READ  మూడు వారాలకే ఓటిటిలో రిలీజ్ అవుతున్న థాంక్యూ


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories