శర్వానంద్, రీతూ వర్మ మరియు అమల అక్కినేని నటించగా . కొత్త దర్శకుడు శ్రీ కార్తిక్ తెరకెక్కించిన టైమ్ ట్రావెల్ ఎమోషనల్ డ్రామా ఒకే ఒక జీవితం సెప్టెంబర్ 9 న విడుదలైంది. మరియు సినీ ప్రేమికుల నుండి మంచి స్పందనను అందుకుంది. తాజా నివేదిక ప్రకారం కలెక్షన్లు ఏ మేరకు వచ్చాయో చూద్దాం.
బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్ సినిమా ఒకే ఒక జీవితం సినిమా గత వారం విడుదలై అటు ప్రేక్షకులు ఇటు విమర్శకుల నుండి అద్బుతమైన స్పందనను సొంతం చేసుకోగా.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వీకెండ్ వరకూ మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత క్లిష్టమైన సాధారణ రోజులలోకి ప్రవేశించింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఉందని ఏకగ్రీవంగా టాక్ చెప్పినప్పటికీ సోమవారం కలెక్షన్లలో కాస్త డ్రాప్ వచ్చిన మాట వాస్తవమే.
సోమవారం మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలలో పెద్దగా కలెక్షన్లు లేని ఈ సినిమా, తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో స్పాట్ బుకింగ్స్ వల్ల మళ్ళీ నిలదొక్కుకుంది. మొత్తం మీద నాలుగవ రోజు బాక్స్ ఆఫీసు వద్ద ట్రేడ్ వర్గాలు ఆశించిన హోల్డ్ ఉన్నప్పటికీ.. సినిమాకు వచ్చిన టాక్ దృశ్యా సినిమా రన్ ఇంకొంచెం బాగా ఉండాల్సిందని అంటున్నారు.
మొత్తానికి తొలిరోజు చాలా స్లో ఓపెనింగ్ తర్వాత ఓకే ఒక జీవితం రెండవ రోజు మరియు మూడవ రోజు నుంచి బాక్స్ ఆఫీసు వద్ద దూసుకుపోయింది. మొత్తంగా బాక్సాఫీస్ వద్ద మూడు రోజుల తొలి వారాంతంలో మంచి నంబర్‌లను నమోదు చేసింది. ఇక ముందుగానే చెప్పుకున్నట్లు ఈ సినిమా సోమవారం రోజు కూడా బాగానే ఉంది.
ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 5 రోజులకు సుమారుగా 10 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన ఈ చిత్రం దాదాపు 3.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది , తమిళనాడులో దాదాపు 2.25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది , మిగిలిన ఏరియాల గ్రాస్ దాదాపు 1 కోటి వరకూ ఉంటుంది . మొత్తంగా ఒకే ఒక జీవితం సినిమా ఐదు రోజులకు దాదాపు 17 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆకట్టుకుంది.
ఆడవాళ్లు మీకు జోహార్లు, మహాసముద్రం, శ్రీకారం వంటి వరుస పరాజయాలతో ఎలాంటి సినిమా చేయాలో తెలియక సతమతమవుతున్న హీరో శర్వానంద్ కు ‘ఒకే ఒక జీవితం’పెద్ద రిలీఫ్ ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌తో శర్వా చాలా సంతోషంగా ఉన్నారు.