మన టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నారు. కాగా ప్రభుత్వం తరపున కార్యక్రమాల్లో ఆయన బిజీబిజీగా కొనసాగుతున్నారు. మరోవైపు ఆయన హీరోగా నటిస్తున్న మూడు సినిమాలైన ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి, హరిహర వీరమల్లు కొంతమేర షూటింగ్ పూర్తి చేసుకున్నాయి.
ఇటీవల హరిహర వీరమల్లు యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అందులో పాల్గొంటున్నారు. మరోవైపు ఓజీ అలానే ఉస్తాద్ భగత్ సింగ్ షూట్స్ లో కూడా ఆయన పాల్గొన్నారు. కాగా వీటిలో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో మాస్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ ఓజి మూవీ పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య గారు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా ప్రియాంక మోహన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వాస్తవానికి ఈ ఏడాది సెప్టెంబర్ 27 విడుదల కావాల్సింది, ఇక కొన్నాళ్ల పాటు వాయిదా పడిన ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్ అవుతుందని కూడా వార్తలు వైరల్ అయ్యాయి. ఇక తాజాగా ఆ డేట్ ని హరిహర వీరమల్లు ఆక్యుపై చేయడంతో ఓజి ఆపైన ఆగస్టులో రిలీజ్ అయ్యే అవకాశం కనబడుతోంది. మొత్తంగా దీన్ని బట్టి ఓజి మూవీ ఏడాది పాటు రిలీజ్ వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. మరి అందరిలో మంచి అంచనాలు ఉన్న ఈ మూవీ ఎంతర మేర విజయం సొంతము చేసుకుంటుందో చూడాలి.