పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూవుడు సినిమాల్లో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు తాజాగా జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పిఠాపురం ఎమ్యెల్యే గా గెలిచిన పవన్ కళ్యాణ్, ఆపైన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ప్రస్తుతం ప్రజా కార్యమ్రమాల్లో బిజీగా ఉన్న పవన్ తాజాగా ఒక మీటింగ్ లో భాగంగా మాట్లాడుతూ, తనకు ప్రస్తుతం చేయవలసిన ప్రజా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని, అలానే త్వరలో ఓజి మూవీ కూడా చూద్దురుగాని ఎంతో బాగుంటుంది మీకు నచ్చుతుందని ఫ్యాన్స్ ని ఉద్దేశించి తెలిపారు. ఇక ఓజి విషయానికి వస్తే యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై దానయ్య అత్యంత గ్రాండ్ గా నిర్మిస్తున్న ఓజిలో ఓజాస్ గంభీర అనే గ్యాంగ్ స్టర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనుండగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఓజి నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుండగా వీలైనంత త్వరలో మూవీని ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.