పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న మూవీస్ లో ఓజి మూవీ కూడా ఒకటి. ఇందులో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ పాత్ర చేస్తుండగా దీనిని మాస్ యాక్షన్ మూవీగా యువ దర్శకుడు సుజీత్ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.
ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థల్లో ఒకటైన డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ స్థాయిలో అత్యధిక వ్యయంతో నిర్మిస్తున్న ఈ మూవీ పై పవన్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఓజి మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ మంచి రెస్సాన్స్ సొంతం చేసుకుని మూవీ పై మరింత క్రేజ్ సొంతం చేసుకుంది.
విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీకి సంబంధించి మ్యూజికల్ సిట్టింగ్స్ చెన్నైలో జరుగుతున్నాయట. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తో పాటు దర్శకుడు సుజీత్ ఈ సిట్టింగ్స్ లో పాల్గొంటుండగా అతి త్వరలో మూవీ యొక్క మిగతా భాగం షూట్ ని తెరకెక్కించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారట. అలానే ఫస్ట్ సాంగ్ రిలీజ్ అప్ డేట్ కూడా త్వరలో రానుందట. మొత్తంగా అందుతున్న సమాచారాన్ని బట్టి పక్కాగా ఓజి మూవీని 2025 సమ్మర్ కానుకగా మార్చి 28 న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు మేకర్స్.