పవన్ కళ్యాణ్ తాజాగా చేస్తున్న మూవీస్ లో ఓజి కూడా ఒకటి. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై భారీ అంచనాలు ఏర్పరిచాయి. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఓజి మూవీలో ఓజాస్ గంభీర అనే పవర్ఫుల్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనుండగా దీనిని యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీగా సుజీత్ తెరకెక్కిస్తున్నారు.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకరైన డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఓజి మూవీ 2025 మార్చి 28న ఆడియన్స్ ముందుకి రానున్నట్లు తెలుస్తోంది. విషయం ఏమిటంటే వాస్తవంగా ఓజి మూవీ అటు సుజీత్ కి ఇటు పవన్ కి ఇద్దరికీ కూడా పెద్ద పరీక్షే అని చెప్పాలి. కెరీర్ పరంగా ఇప్పటివరకు ఒక్క 100 కోట్ల షేర్ కూడా లేని పవన్ దీనితో భారీ విజయం అందుకుంటుందని ఆయన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
మరోవైపు సాహో తో మంచి సక్సెస్ అందుకోలేకపోయిన సుజీత్ కూడా ఓజి ని ఎలాగైనా భారీ సక్సెస్ చేసి కెరీర్ లో దూసుకెళ్లాలని భావిస్తున్నారు. నిజానికి సుజీత్ సినిమాలు చూడడానికి స్టయిలిష్గ్ గా అనిపించినా కంటెంట్ పరంగా అంత రీచ్ ఉండదు, మరి ఒజితో ఏస్థాయిలో అలరిస్తారో చూడాలి.