సీనియర్ నటుడు నరేష్ అనేక ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లతో వృత్తిపరంగా మంచి సమయాన్నే గడుపుతూ ఉండవచ్చు. అయితే, ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం నెటిజన్ల నుండి అనేక ట్రోల్స్ మరియు వ్యాఖ్యలను ఆకర్షిస్తోంది. స్క్రీన్ వెలుపల నరేష్ యొక్క అభ్యంతరకరమైన ప్రవర్తన మరియు నటి పవిత్ర లోకేష్‌తో ఆయన సంబంధం చాలా కాలంగా అందరి దృష్టిలో ఉన్నాయి.
దానికి తగ్గట్టే, ఇటీవల తన మూడవ భార్య రమ్య రఘుపతితో బహిరంగంగా మాటల యుద్ధం కూడా చాలా విమర్శలకు దారి తీసింది.
అయితే, నరేష్ వాటన్నింటినీ తొలగించి, కొత్త ఉత్సాహంతో కొత్త సంవత్సరంలోకి ప్రవేశించాలనుకుంటున్నారు. పవిత్ర లోకేష్‌తో తన పెళ్లిని నరేష్ ట్విట్టర్‌లో చిన్న వీడియోతో ప్రకటించారు. ‘న్యూ ఇయర్, న్యూ బిగినింగ్స్, నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్’ అనే శీర్షికతో, నటుడు ఈ వీడియోతో తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు.
గత కొన్నేళ్లుగా వీరిద్దరూ తమ స్నేహం గురించి చాలా బహిరంగంగానే ఉన్నారు. అయితే, ఇన్నాళ్లూ పవిత్ర లోకేష్ మాత్రం నరేష్ తనకు మంచి స్నేహితుడని, తత్వవేత్త, మార్గదర్శి అని పేర్కొంటూ వచ్చారు. ఇప్పుడు ఈ ప్రకటనతో, నరేష్ మొదటిసారిగా తమ బంధాన్ని బహిరంగపరిచారు.
ఇక నరేష్ ట్విట్టర్ లో ఈ వీడియో పోస్ట్ చేయగానే అది పలు రకాల స్పందనలకు దారి తీసింది. కొంతమంది ఈ వయసులో ఈయనకి ఏమిటి ఈ పనులు, ఇలా ప్రవర్తించటం తప్పు కదా అని విమర్శించగా.. మరి కొందరు మాత్రం అందులో తప్పేముంది అది వాళ్ళిద్దరి వ్యక్తిగత జీవితం అందులో మనం తలదూర్చాల్సిన అవసరం లేదని అన్నారు.