Homeసినిమా వార్తలుఎట్టకేలకు OTT లో విడుదల అవుతున్న పెళ్ళి సందD

ఎట్టకేలకు OTT లో విడుదల అవుతున్న పెళ్ళి సందD

- Advertisement -

ఈ రోజుల్లో ఏ సినిమా అయినా నాలుగు వారాలలో ఓటిటి లో అందుబాటులోకి వచ్చేస్తుంది. అది పెద్ద హీరో సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే. ఎక్కడో ఒక చోట ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమాలు ఎనిమిది లేదా పది వారాలు గడిచాక స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చాయి.

అయితే సినిమా విడుదల అయి 200 రోజుల వరకు కూడా ఓటిటిలో రిలీజ్ అవని రికార్డ్ “పెళ్ళి సందడి2” కే దక్కుతుంది.ఓటిటిలో సినిమా విడుదల కాకపోవడానికి కారణమేంటి అంటూ అభిమానులు సోషల్ మీడియాలో తెగ వెతికారు. అసలు ఎందుకు పెళ్లి సందడి సినిమా ఓటిటిలోకి రాలేదని ఆరాలు కూడా తీశారు.

సంక్రాంతికి వచ్చేస్తుందనే వార్తలు వచ్చినా కూడా అది జరగలేదు. ఇప్పటి వరకు ఏ ఓటిటి సంస్థ దగ్గర పెళ్లి సందడి రైట్స్ లేవనే విషయం బయట పడింది. అయితే ఈ మధ్యే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ అమ్ముడయ్యాయి అని తెలిసింది.ఎట్టకేలకు ఈ 24 తారీఖున పెళ్ళి సందడి చిత్రం జీ5 లో అందుబాటులోకి రానుంది.

READ  బ్రహ్మాస్త్ర ట్రైలర్ ఎలా ఉందంటే

గత ఏడాది పెళ్లి సందడి సినిమాతో పూర్తిస్థాయిలో లాంఛ్ అయ్యాడు శ్రీకాంత్ కొడుకు రోషన్.  రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వస్తున్న సినిమా కావడంతో పాటు పాతికేళ్ల క్రితం వచ్చిన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయినా పెళ్లి సందడి సినిమాకి సీక్వెల్ అవడంతో మంచి అంచనాల మధ్య పోయిన దసరా కి పెళ్లి సందడి రిలీజ్ అయింది.ఇందులో దర్శకేంద్రుడు కూడా నటించాడు. గౌరీ రోనంకీ దర్శకురాలు. ట్రైలర్ మరియు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రానికి రివ్యూలు,టాక్ ఆశించిన రీతిలో రాలేదు. అయితే పాటలు సూపర్ హిట్ అవడం,హీరోయిన్ శ్రీ లీల కి యూత్ ఆడియన్స్ ఫ్యాన్స్ గా మారడం,అలాగే హీరో హీరోయిన్ ల జోడీ,పాటల్లో వాళ్ళు అద్భుతంగా లయబద్దంగా చేసిన డాన్స్ ఇవన్నీ సినిమాకు కలిసి వచ్చి కలెక్షన్ లు బాగా వచ్చాయి. నిర్మాతల దగ్గర నుంచి పంపిణీ దారుల వరకు అందరికీ లాభసాటి వ్యాపారం జరిగింది. అయితే ఆ తరువాత సినిమా ఓటిటి లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనే విషయం మీద పలు రకాల పుకార్లు వచ్చినా ఏవీ నిజం కాలేదు. ఎట్టకేలకు ఇన్ని రోజులకు పెళ్ళి సందడి2 ఓటీటిలో విడుదల అవుతుండటం ఆ చిత్ర అభిమానులకు శుభవార్త అనే చెప్పాలి.

Follow on Google News Follow on Whatsapp

READ  ఆ ప్రొడ్యూసర్ నన్ను బ్లాక్ మెయిల్ చేసాడు - చాందినీ చౌదరి


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories