తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న వార్త దాదాపు ఖరారు అయినట్టే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించే చిత్రం (Thalapathy67) LCU (లోకేష్ కనగరాజ్ యూనివర్స్‌లో ఖైదీ, విక్రమ్ సినిమాల సీక్వెల్ సినిమాలు) భాగం అవుతుందని గట్టిగా వినిపిస్తోంది. విక్రమ్ చిత్రం ఘనవిజయం సాధించినప్పటి నుండి విజయ్ అభిమానులు ఇదే కోరుకుంటున్నందున ఇది వారికి ఉత్తేజకరమైన విషయంగా భావించవచ్చు.
కమల్ హాసన్, సూర్య, కార్తీలు ముఖ్యమైన పాత్రలలో నటించిన ఈ ప్రతిష్టాత్మకమైన సీరీస్ లో తమ స్టార్ కూడా భాగం కావాలని వారు కోరుకుంటున్నారు.
విజయ్ ఇంతకుముందు లోకేష్ కనగరాజ్‌తో కలిసి పనిచేసినప్పటికీ, మాస్టర్ సినిమా LCUలో చేర్చబడలేదు. ఇండస్ట్రీ హిట్ అయిన విక్రమ్ ద్వారా దాని విలువ తెలుసుకున్న విజయ్ అభిమానులు ఆ సినిమాలో తమ హీరో భాగం కాలేకపోయిందని కాస్త నిరాశ చెందారు.
ట్విట్టర్‌లో, వారు LCUలో Thalapathy67 సినిమాని చేర్చడం కోసం హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్‌లను ప్రదర్శించారు. మరిప్పుడు ఆశించినట్లు జరుగుతుంది కాబట్టి , వారు ఇప్పుడు సంతృప్తి చెందారు మరియు సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు.
కమల్ తన రాజ్ కమల్ ఫిల్మ్ బ్యానర్ (ఆర్‌కెఎఫ్‌ఐ)తో నిర్మాణం వహిస్తూ ఈ ప్రాజెక్ట్‌లో నిర్మాతగా కూడా పాల్గొంటారని సమాచారం. సెవెన్ స్క్రీన్స్ అనే మరో పెద్ద బ్యానర్ కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం కానుందట.
ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో విక్రమ్ లేదా రోలెక్స్ భాగమవుతారని అంతర్గత వర్గాలు పేర్కొంటున్నాయి. విజయ్‌ని సూర్య లేదా కమల్‌హాసన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చూడటానికి కేవలం అభిమానులకే కాక ఇతర ప్రేక్షకులకి కూడా కన్నుల పండువగా ఉంటుంది.
విజయ్ ప్రతినాయక ఉన్న పాత్రలో నటిస్తే మరింత ఆసక్తికరంగా ఉంటుంది.ఇక విజయ్ తాజా చిత్రం వారిసు 2023 సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉంది, ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల కేటాయింపు వ్యవహారం టాలీవుడ్ మరియు కోలీవుడ్‌లో అలలు సృష్టిస్తోంది.
వాడి వేడి చర్చలు, ఘాటు వ్యాఖ్యలు రోజువారీ వ్యవహారంగా మారాయి. రెండు పరిశ్రమల నిర్మాతలు కూడా మీడియా లో దూకుడు పెంచుతున్నారు. ప్రకటనలు చేతులు దాటిపోయి ఇరు పరిశ్రమల మధ్య అనవసర రాద్ధాంతం చేస్తున్నారు.