Homeసినిమా వార్తలుNTR30: ఎన్టీఆర్ 30లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్

NTR30: ఎన్టీఆర్ 30లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్

- Advertisement -

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ‘ఎన్టీఆర్ 30’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా సెట్స్ లో ఈ రోజు ఆయన సెట్స్ లో జాయిన్ అయ్యారు. ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివతో సైఫ్ సరదాగా మాట్లాడుతుంది రిలాక్స్ అవుతున్న కొన్ని ఫోటోలను చిత్ర నిర్మాతలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇక అంతర్గత వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సైఫ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారట. ఇదే నిజమైతే ఈ సినిమాతో ఆయన రెండో సారి విలన్ గా కనిపించనున్నారు. ఇప్పటికే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ లో కూడా సైఫ్ విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. తమ అభిమాన హీరో సినిమాలో బాలీవుడ్ తారలు నటించడం చూసి ఎన్టీఆర్ అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఎన్టీఆర్ 30లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఫైనల్ చేయగా, నేడు సైఫ్ సెట్స్ లో జాయిన్ అయ్యారు.

READ  Mythri Movie Makers: అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ చేసిన ఖరీదైన తప్పిదం

ఇక ఇప్పటికే స్టంట్స్, విజువల్స్ విభాగాలను చూసుకోవడానికి ఎన్టీఆర్ 30 చిత్ర బృందం గొప్ప హాలీవుడ్ టెక్నీషియన్లను నియమించింది. ఎన్టీఆర్ 30 ఇప్పటి వరకు తాను చేసిన సినిమాల్లోనే బెస్ట్ మూవీ అవుతుంది అని కొరటాల శివ పూజా కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులకు భరోసా ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ హిట్ తర్వాత తమ అభిమాన హీరోను మరో భారీ, విజయవంతమైన చిత్రంలో చూడాలని ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాల పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు. శ్రీకర్ ప్రసాద్ ఈ చిత్రానికి ఎడిటర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ సాబు సిరిల్ అందిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

READ  Telangana Backdrop: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాస్త తక్కువ ప్రభావం చూపుతున్న తెలంగాణ నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమాలు

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories