నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ హిట్ సినిమా వీర సింహా రెడ్డి ఎట్టకేలకు ఓటీటీ విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డిజిటల్ అరంగేట్రం చేయనుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
ఫిబ్రవరి 23, 2023 సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమాను తమ ప్లాట్ ఫారంలో ఈ సినిమా ప్రసారం చేయనున్నట్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ తమ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది.
బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ఈ సంక్రాంతికి విడుదలై మిక్స్ డ్ రివ్యూలు, పబ్లిక్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో మంచి వసూళ్లు రాబట్టి అద్భుతమైన ఓపెనింగ్ వీకెండ్ ను రాబట్టింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంతో పాటు ఈ చిత్రాన్ని విడుదల చేశారు.
వీరసింహారెడ్డి పాత్రలో బాలకృష్ణ తనదైన శైలిలో మెస్మరైజ్ చేశారు. ఇది ఆయన కెరీర్ బెస్ట్ మేకోవర్ అని చెప్పొచ్చు. కేవలం ఆయన లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్ మాత్రమే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రాణించడానికి కారణంగా నిలిచి, కథలోని ఇతర లోపాలన్నింటినీ మరిచిపోయేలా చేశాయి.
ఐతే ఫస్ట్ వీకెండ్ తర్వాత ఈ సినిమా మంచి రన్ ను కంటిన్యూ చేయలేకపోయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. బాలకృష్ణ గత చిత్రం అఖండ బ్లాక్ బస్టర్ కాగా, వీరసింహారెడ్డితో తన అద్భుతమైన ఫామ్ ను ఆయన కొనసాగించారు.
బాలకృష్ణ ముఖ్య పాత్ర పోషించిన వీర సింహా రెడ్డి సినిమాలో కన్నడ నటుడు దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రుతిహాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో హనీ రోజ్ కూడా కీలక పాత్రలో నటించారు.