స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి సినిమాని అధికారికంగా ప్రకటించారు. అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఆయన ఓ సినిమా చేయనున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై ఈరోజు ఉదయమే అధికారిక ప్రకటన వెలువడింది.
కాగా ఈ చిత్రాన్ని బాలీవుడ్ దిగ్గజం టీ-సిరీస్, వంగాకు చెందిన భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుకు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప ది రూల్ షూట్ లో బిజీగా ఉండగా సందీప్ రెడ్డి వంగా ఇటీవల రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమాను పూర్తి చేశారు.
ఇక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా టీ-సిరీస్ నిర్మించనున్న ‘స్పిరిట్’ సినిమా పూర్తయిన తర్వాత ఈ అల్లు అర్జున్- సందీప్ వంగా కాంబోలోని సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ యొక్క ఫిల్మోగ్రఫీ మరింత బలోపేతం చేయబడింది మరియు ఇది ఒక.చక్కని ఎంపికలా కనిపిస్తుంది. ప్రస్తుతం సుకుమార్ తో పుష్ప సినిమా తర్వాత త్రివిక్రమ్, సందీప్ వంగాతో సినిమా చేయనున్నారు. తెలుగు దర్శకులతో పాన్ ఇండియా స్థాయిలో వెళ్లాలన్నది బన్నీ ప్లాన్ గా కనిపిస్తుంది.
మరి సందీప్ రెడ్డి వంగాతో పాన్ ఇండియా సినిమా తీసి భారీ విజయం సాధించాలనే అల్లు అర్జున్ ప్లాన్ పని చేస్తుందా లేదా వేచి చూడాలి. కానీ ఈ సినిమా పట్టలెక్కాలంటే ఎంత లేదన్నా రెండు మూడు సంవత్సరాల సమయం పడుతుంది.