తమన్నా భాటియా నాగ సాధువుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓదెల 2. ఈ మూవీని యువ దర్శకుడు అశోక్ తేజ దర్శకత్వం వహిస్తుండగా తెలుగు సహా పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రాన్ని మేకర్స్ రిలీజ్ చేసేందుకు గ్రాండ్ గా ప్లాన్ చేసారు.
ఇక ఈ సినిమాకి కాంతారా, విరూపాక్ష, మంగళవారం చిత్రాల సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా మధు క్రియేషన్స్ అలాగే సంపత్ నంది టీం వర్క్ వారు నిర్మాణం వహించారు. నిర్మాతగా సంపత్ నంది భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఓదెల 2 టీజర్ ఇటీవల మహా కుంభమేళాలో రిలీజ్ అయి మంచి రెస్సాన్స్ సొంతం చేసుకుంది.
కాగా విషయం ఏమిటంటే, ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి సమ్మర్ కానుకగా ఏప్రిల్ 17న రిలీజ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు. గతంలో రిలీజ్ అయిన ఓదెల రైల్వే స్టేషన్ కూడా మంచి విజయం అందుకోవడంతో దీని పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ మూవీలో తమన్నా తన అద్భుత నటనతో అందరినీ ఆకట్టుకోవడంతో పాటు మూవీ విజయం ఖాయం అని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.