Homeసినిమా వార్తలుDil Raju: విడుదలయ్యే థియేటర్ల సంఖ్య డిస్ట్రిబ్యూటర్ సామర్థ్యాన్ని నిర్ణయిస్తుందని చెప్పిన దిల్ రాజు

Dil Raju: విడుదలయ్యే థియేటర్ల సంఖ్య డిస్ట్రిబ్యూటర్ సామర్థ్యాన్ని నిర్ణయిస్తుందని చెప్పిన దిల్ రాజు

- Advertisement -

వాల్తేరు వీరయ్య మరియు వీరసింహారెడ్డి రెండు చిత్రాలు సంక్రాంతి-2023కి విడుదల తేదీలను ప్రకటించినప్పటి నుండి, తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు చిత్రాలకు థియేటర్ల యొక్క కేటాయింపుపై చాలా వివాదాలు జరుగుతున్నాయి.

ఈ రెండు చిత్రాల నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్‌ని ప్రారంభించి, నైజాంలో తమ రెండు పెద్ద చిత్రాలైన వాల్తేరు వీరయ్య మరియు వీరసింహారెడ్డిని విడుదల చేసేందుకు అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారు. అయితే డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఎక్కువ అనుభవం ఉన్న, థియేటర్ల పై పట్టు ఉన్న దిల్ రాజుతో వారు ఎలా పోటీ పడతారన్నది అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న.

వారిసు/వారసుడు సినిమాకి అత్యధిక థియేటర్లు కేటాయించేందుకు దిల్ రాజు తన వంతు ప్రయత్నం చేయడం సహజం. కానీ సమస్య ఏమిటంటే ఇది ఒక డబ్బింగ్ చిత్రం, కాబట్టి ఆయనకి ఎగ్జిబిటర్లు మరియు నిర్మాతల గిల్డ్ వంటి ఇతర పరిశ్రమ వ్యక్తుల నుండి తెలుగు సినిమాలకే తొలుత ప్రాధాన్యతను ఇవ్వాలన్న విపరీతమైన ఒత్తిడి కూడా ఉంటుంది.

READ  NTR30: తీవ్ర ఒత్తిడిలో ఎన్టీఆర్ మరియు కొరటాల శివ

కాగా ఈ రోజు దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో, మైత్రీ మేకర్స్ వారు పంపిణీని ప్రారంభించినందున, ఎన్ని థియేటర్లలో విడుదల చేస్తారు అనే విషయమే డిస్ట్రిబ్యూటర్ సామర్థ్యాన్ని నిర్ణయిస్తుందని ధృవీకరించారు. ఇప్పుడు తాము పోటీలో ఉన్నామని, ఇది పూర్తిగా వ్యాపారమేనని అన్నారు. ఈ పోటీలో తనను తాను నిరూపించుకుంటానని దిల్ రాజు అన్నారు.

మరి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల రేసులో ఎవరి పై ఎవరు గెలుస్తారో చూడాలి. ఇక సంక్రాంతికి విడుదలవుతున్న మూడు సినిమాలూ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశాయి.

వారిసు సినిమాకి సంబంధించి ఇటీవలే ఆడియో లాంచ్ జరిగింది మరియు నిన్న వాల్తేరు వీరయ్య చిత్ర బృందం అధికారికంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. వీరసింహరెడ్డి సినిమా నుండి కొన్ని రోజుల క్రితం మూడవ సింగిల్‌ని విడుదల చేసారు మరియు ఈ రెండు చిత్రాల ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లు జనవరి మొదటి వారంలో జరుగనున్నాయి.

Follow on Google News Follow on Whatsapp

READ  AdiPurush: మళ్ళీ వాయిదా పడిన ప్రభాస్ ఆదిపురుష్ సినిమా


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories