మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, కొరటాల కాంబినేషన్లో ఎప్పటి నుంచో ఒక సినిమా అనుకుంటున్నప్పటికీ అది కార్య రూపం దాల్చలేదు. ఇక తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం కొత్త పుకారు ఏమిటంటే, ఎన్టీఆర్ (ఎన్టీఆర్ 30) తో దర్శకుడు కొరటాల శివ చేయబోయే సినిమా స్క్రిప్ట్ JR ఎన్టీఆర్ వద్దకు రాకముందే చరణ్ దానిని తిరస్కరించారట.
చరణ్ – కొరటాల కాంబో క్యాన్సిల్ కావడం ఇదే మొదటిసారి కాదు. కొరటాల తన సినీ అరంగేట్రం నుండి చరణ్‌కి స్క్రిప్ట్‌లు చెబుతూనే ఉన్నారు. మిర్చి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బండ్ల గణేష్ ప్రొడక్షన్‌లో చరణ్‌తో కొరటాల కలిసి పనిచేయాల్సి ఉండింది. అయితే ఆ కథ చరణ్‌కి అంతగా నచ్చకపోవడంతో ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు.
తరువాత, వారిద్దరూ కలిసి మళ్ళీ పని చేద్దాం అనే తరుణం వచ్చినప్పుడు, RRR సినిమా వారిద్దరికీ అడ్డుగా నిలిచింది. దాంతో చిరంజీవి రంగంలోకి దిగి కొరటాలతో సినిమా చేశారు. ఆ సినిమానే ఆచార్య. ఆ చిత్రం బాక్సాఫీస్ వైఫల్యం గూర్చి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక అలాంటి దారుణమైన పరాజయం తర్వాత రామ్ చరణ్ మరియు కొరటాల మధ్య గ్యాప్ మరింత పెరిగింది.
ముందుగానే చెప్పుకున్నట్లు తాజాగా వినిపిస్తున్న పుకార్లు నమ్మితే, ఎన్టీఆర్ 30 స్క్రిప్ట్ వాస్తవానికి చరణ్‌కు వివరించబడిందనే అంటున్నారు. కానీ ఆ స్క్రిప్ట్ చరణ్ ను పెద్దగా ఆకట్టుకోలేదట. ఆ తర్వాత అదే కథ అల్లు అర్జున్ మరియు ఎన్టీఆర్‌ల వద్దకు వెళ్లింది.
ఎన్టీఆర్ మరియు కొరటాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నందున, కొరటాల ఆ కథను ఎన్టీఆర్ కు వివరించారు. అయితే ఆచార్య ఫలితం తర్వాత ఈ స్క్రిప్ట్‌లో చాలా మార్పులు జరిగాయి.
ప్రస్తుతం ఎన్టీఆర్30 తాలూకు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాగా ఎన్టీఆర్ 30వ సినిమాకి యువ తరంగం అనిరుధ సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.