Home సినిమా వార్తలు NTR30: కొరటాల గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా.. ఈసారి టార్గెట్ మెడికల్ మాఫియా..?

NTR30: కొరటాల గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా.. ఈసారి టార్గెట్ మెడికల్ మాఫియా..?

NTR30 Movie To Have Medical Mafia Backdrop
NTR30 Movie To Have Medical Mafia Backdrop

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అనౌన్స్ చేసి రోజులు గడుస్తున్నా, ఇంకా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను మాత్రం చిత్ర యూనిట్ స్టార్ట్ చేయలేదు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలో ఎన్టీఆర్ 30వ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో తారక్ నయా లుక్‌లో కనిపిస్తాడని ఇప్పటికే చిత్ర యూనిట్ తెలిపింది. కాగా, ఈ సినిమా కోసం కొరటాల ఓ సరికొత్త కథను రాసుకున్నాడని, ఈ కథలో ఎన్టీఆర్ చేసే పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా కథ మొత్తం మెడికల్ మాఫియా చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. కొరటాల శివ తన సినిమాల్లో ఏదో ఒక సోషల్ మెసేజ్ ఇవ్వడం ఆయనకు అలవాటు. అలాగే, ఈ సినిమాలో మెడికల్ మాఫియాపై హీరో యుద్ధం చేస్తే ఎలా ఉండబోతుందా అనే పాయింట్‌ను కమర్షియల్ అంశాలు జోడించి మనకు మరింత పవర్‌ఫుల్‌గా చూపించనున్నాడు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం సినీ వర్గాల్లో ఈ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా తారక్ లాంటి స్టార్ హీరోతో ఇలాంటి కథను రెడీ చేస్తున్న కొరటాల ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version