టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ మూవీ దేవర పార్ట్ 1. గత ఏడాది సెప్టెంబర్ లో మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన దేవర పార్ట్ 1 మూవీ అద్భుత విజయం అందుకుని నటుడిగా ఎన్టీఆర్ క్రేజ్ ని రేంజ్ ని మరింతగా పెంచింది.
ఇక ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీ చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ మూవీపై అందరిలో చాలా అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తో చేయనున్న సినిమా యొక్క షూటింగ్ ప్రారంభానికి సిద్ధమైంది.
అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ మూవీ వచ్చే సోమవారం సెట్స్ మీదకు వెళ్లనుంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో గ్రాండ్ లెవెల్ లో నిర్మించనున్న ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలకపాత్రలో మలయాళ నటుడు టోవినో థామస్ కనిపించన్నట్లు చెబుతున్నారు.
రానున్న రోజుల్లో ఈ మూవీకి సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ రానుంది. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే అది చాలావరకు సాధ్యమయ్యే అవకాశం కనపడట్లేదు. ఈ విషయమై టీం నుంచి అఫీషియల్ గా వివరణ రావాల్సి ఉంది.