ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో సినిమా (NTR 30) రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలోవీరిద్దరూ చేసిన “జనతా గారెజ్” ఘన విజయం సాధించింది.కాబట్టి ఈ కొత్త సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి.పైగా ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమా తరువాత వస్తున్న సినిమా అందులోనూ పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా భారీ అంచనాలు ఉంటాయి.
అందుకే ఈ సినిమా కాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. స్క్రిప్ట్ పట్లా, సన్నివేశాల పట్లా ఎన్టీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని సమాచారం. అందువల్ల అన్నీ పక్కాగా కుదిరి ఓకే అనుకున్న తరువాతే సినిమా సెట్స్ మీదకి వెళ్లనుందట.ముందుగా షూటింగ్ ఏప్రిల్ లో మొదలవుతుంది అన్నారు ఆ తరువాత మే,జూన్ అని మొన్నటి వరకు ఆగస్ట్ లో షూటింగ్ మొదలవుతుందని అన్నా తాజా వార్తల ప్రకారం సెప్టెంబర్ కు గానీ పనులు ప్రారంభం అవ్వవు అని తెలుస్తుంది.
ఇక ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఓ స్పెషల్ వీడియోను టీమ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో నెటిజన్స్ నుండి విశేష స్పందన రాబట్టుకుంది. ఈ వీడియోలో డైలాగ్ “అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మంచి తను ఉండకూడదని.. అప్పుడు భయానికి తెలియాలి తను రావల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా’ కి ఇప్పటికే కథా కమామీషు ఏమయి ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకుల ను ఒక ఊపు ఊపెస్తున్న యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. టీజర్ కు అతను ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.
ఈ సినిమాలో హీరోయిన్ గా ఆలియా భట్ నటిస్తుంది అన్న ప్రచారం గట్టిగా జరిగింది. అయితే ఇప్పుడు ఆమె ఈ సినిమా నుంచి వైదొలగినట్టు తెలుస్తుంది. ఇటీవలే రణ్ బీర్ కపూర్ ను పెళ్లి చేసుకున్న అలియా ఇతర ప్రాజెక్ట్ ల డేట్స్ క్లాష్ అవ్వడం వలన ntr 30 నుండి తప్పుకున్నట్టు చెప్తున్నారు. మరి యే హీరోయిన్ ను సెలెక్ట్ చేశారో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.