ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా ఆయన ఫిల్మోగ్రఫీకే కాదు యావత్ తెలుగు సినిమా పరిశ్రమలోనే ఐకానిక్ చిత్రాల్లో ఒకటి. ఈ చిత్రం ఆ సమయంలో యువ నటుడిగా ఉన్న ఎన్టీఆర్ ను బిగ్ లీగ్ స్టార్ గా నిలబెట్టి, తెలుగు సినీ అభిమానులకు వినోదం మరియు యాక్షన్ యొక్క పూర్తి ప్యాకేజీని అందించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ క్రేజ్ ను కూడా పెంచింది. ఇక ఈ సినిమా రిలీజై దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఇప్పుడు సింహాద్రి రీరిలీజ్ చేయడానికి అభిమానులు ప్లాన్ చేస్తున్నారు.
మే 20న సింహాద్రి రీరిలీజ్ తో ఎన్టీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉండగా, సోషల్ మీడియాలోనూ, ఆఫ్ లైన్ లోనూ ఇక విచిత్రమైన ప్రచారం జరుగుతోంది. సింహాద్రిని ఇండస్ట్రీ హిట్ గా ప్రకటించాలని ఎన్టీఆర్ అభిమానులు నిజంగానే దూకుడు ప్రదర్శిస్తున్నారు.
సింహాద్రి బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ అయినా అప్పటి ఇండస్ట్రీ హిట్ అయిన ఇంద్ర సినిమా కలెక్షన్లను క్రాస్ చేయలేకపోవడంతో ఇండస్ట్రీ హిట్ కాలేకపోయింది.
కాగా ఈ రాజమౌళి ప్రాజెక్ట్, ఇటీవల విడుదలైన ఇతర రీరిలీజ్ ల మాదిరిగానే 4కే టెక్నాలజీలో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఈ సినిమా విజయం పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సింహాద్రి రీరిలీజ్ ను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. స్పెషల్ స్క్రీనింగ్స్ విషయంలో ఎన్టీఆర్ సినిమాలకు మంచి రికార్డ్ ఉండటంతో ఖుషి రీరిలీజ్ డే 1 రికార్డును బద్దలు కొడుతుందని ఎన్టీఆర్ అభిమానులు ఆశిస్తున్నారు.