తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించ దగ్గ నటులలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. అలాగే ఆయన అభిమాన గణం కూడా అత్యంత ప్రభావితం చేయగల అభిమాన వర్గాల్లో ఒకరు. తమ హీరోకు జరిగే మంచైనా చెడైనా ఎలాంటి ప్రతికూల సమయాలు ఎదురైనా ఎన్టీఆర్ అభిమానుల ఆయనకు అన్నివేళలా మద్దతు ఇచ్చారు అనేది వాస్తవం. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ తదుపరి చేయబోయే సినిమా విషయంలో మాత్రం .. ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయంపై అభిమానులు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.
ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల ఇటీవల ఆచార్య సినిమా ఫలితం, తద్వారా ఉద్భవించిన సమస్యల కారణంగా చాలా ఇబ్బందుల్లో పడ్డారు. కాగా ఆచార్య సినిమా తాలూకు నష్టాలను భర్తీ చేయడానికి ఆయన చాలా కాలం శ్రమ పడాల్సి వచ్చింది . దీంతో ఎన్టీఆర్‌తో ఆయన చేయాల్సిన సినిమా ప్రారంభం అలా వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో కొరటాల శివ స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేసేందుకు అదనపు సమయం కోరడంతో సినిమా మరింత ఆలస్యమైంది. తాజాగా అభిమానులను నిరాశ పరుస్తూ మరో వార్త బయటకు వచ్చింది.
అదేంటంటే ఇప్పుడు ఎన్టీఆర్ 30 సినిమాకు సంబందించిన మొత్తం స్క్రిప్ట్‌ను మార్చేస్తున్నారని సమాచారం. కొరటాల శివ ఎన్టీఆర్ సినిమా కోసం కొత్త స్క్రిప్ట్‌ని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారట. అంతే కాకుండా స్క్రిప్ట్ వర్క్ లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు, మొత్తం కథను సమకూర్చుకునే వరకు దాదాపు 3 నెలలు సమయం కావాలని అభ్యర్థిస్తున్నారట.
ఇలా సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి రకరకాల కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతుండటంతో ఎన్టీఆర్ అభిమానులు ఏమాత్రం సంతోషించలేకపోతున్నారు. ఆచార్య సినిమాకి కూడా ఇలాగే షూటింగ్ మొదలయ్యే దగ్గర నుంచి పూర్తయ్యే వరకూ ఇలానే చాలా సార్లు ఆగడం లేదా వాయిదా పడటం స్క్రిప్ట్ మార్చటం వంటి విషయాలు జరిగాయి. అందువల్లే ఆ సినిమా తలా తోకా లేకుండా తయారయింది. ఇక ఆ చిత్ర ఫలితం కూడా మనందరికీ తెలుసు. అలాంటిది అసలు సినిమా అనుకున్నప్పుడు ముందుగా పూర్తి స్క్రిప్ట్ వినకుండా ఎన్టీఆర్ ఎందుకు ఈ సినిమాని ఎందుకు ఒప్పుకున్నారు అన్న విషయాన్ని అభిమానులు అర్ధం చేసుకోలేకపోతున్నారు.