Homeసినిమా వార్తలుLokesh Kanagaraj: మానగరం సమయంలో లోకేష్ కనగరాజ్ ను ఏ తెలుగు నిర్మాత నమ్మలేదు :...

Lokesh Kanagaraj: మానగరం సమయంలో లోకేష్ కనగరాజ్ ను ఏ తెలుగు నిర్మాత నమ్మలేదు : సందీప్ కిషన్

- Advertisement -

ప్రస్తుతం సందీప్ కిషన్ తన పాన్ ఇండియా మూవీ మైఖేల్ ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా ప్రచారం సందర్భంగా సందీప్ తను గతంలో కథానాయకుడిగా నటించిన ‘మానగరం’ చిత్రం సమయంలో లోకేష్ కనగరాజ్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

మానగరం ప్రాజెక్ట్ కోసం దర్శకుడు లోకేష్ ను తకి ఆరుగురు నిర్మాతల వద్దకు తీసుకెళ్లానని, వారంతా ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వడానికి నిరాకరించారని సందీప్ వెల్లడించారు. 2017లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించి లోకేష్ కనగరాజ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఈ సినిమాతో వచ్చిన ఇమేజ్ వల్ల తరువాత ఈ యువ దర్శకుడు కార్తీ యొక్క ఖైదీ మరియు కమల్ హాసన్ తో విక్రమ్ వంటి కల్ట్ యాక్షన్ థ్రిల్లర్లతో పాటు తమిళ సూపర్ స్టార్ విజయ్ తో మాస్టర్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించారు.

ఇక ‘మైఖేల్’ విషయానికి వస్తే ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి రంజిత్ జయకోడి దర్శకత్వం వహించనున్నారు.

వరలక్ష్మి శరత్ కుమార్, గౌతమ్ మీనన్, దివ్యాంశ కౌశిక్ ప్రధాన తారాగణంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని భరత్ చౌదరి, పుస్కూర్ రావు నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

READ  Thalapathy67: లోకేష్ మల్టీవర్స్ నుంచి విజయ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories