పాన్ ఇండియన్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా ఇటీవల కొరటాల శివ తీసిన మూవీ దేవర పార్ట్ 1. ఈమూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ కనిపించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఫస్ట్ డే నుండి మంచి టాక్ ని సొంతం చేసుకుని ఓపెనింగ్ మొదలుకొని క్లోజింగ్ వరకు బాగానే కలెక్షన్ రాబట్టింది.
ఇక దేవర పార్ట్ 1 మూవీ ఓవరాల్ గా రూ. 450 కోట్ల మేర కలెక్షన్ కొల్లగొట్టింది. అయితే ఈ మూవీ ఇంకా బాగా రాబడుతుందని అనుకున్నప్పటికీ అది నెరవేరలేదు. రాక్ స్టార్ అనిరుద్ సంగీతం అందించిన ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మించాయి. ఇక ఈ మూవీలో దేవర, వర పాత్రలో మరొక్కసారి తన అద్భుత పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు ఎన్టీఆర్.
విషయం ఏమిటంటే, తాజాగా ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చిన దేవర పెద్దగా రెస్పాన్స్ అందుకోవడం లేదు. దానితో దేవర సీక్వెల్ వచ్చే అవకాశం చాలావరకు తక్కువనేది ఫిలిం నగర్ సర్కిల్స్ టాక్. దానికి ప్రధాన కారణం ప్రస్తుతం వార్ 2 మూవీ చేస్తోన్న ఎన్టీఆర్, ఆ తరువాత ఇప్పటికే ప్రశాంత్ నీల్, నెల్సన్ సినిమాలు వరుసగా లైన్లో పెట్టడమే అంటున్నారు. మరి నిజంగానే దేవర పార్ట్ 2 ఉంటుందా లేదా అనేది తెలియాలి అంటే మరికొన్నాళ్ళు ఆగాల్సిందే.