Home సినిమా వార్తలు DVV Danayya: ఆస్కార్ కు ముందు ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి ఎవరూ నన్ను సంప్రదించలేదు: దానయ్య

DVV Danayya: ఆస్కార్ కు ముందు ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి ఎవరూ నన్ను సంప్రదించలేదు: దానయ్య

గత ఏడాది మార్చిలో రిలీజ్ అయిన దగ్గర నుంచీ నేటి వరకూ ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం చాలా బిజీగా ఉంది. గోల్డెన్ గ్లోబ్స్, ఆస్కార్ అవార్డుల కోసం యూఎస్ టూర్ ప్రారంభానికి ముందు ఈ చిత్ర బృందం యుఎస్ మరియు యుకెలో ప్రచారం కోసం పలు పర్యటనలు చేసింది మరియు సినిమా విడుదల కోసం జపాన్ ను కూడా సందర్శించింది.

అయితే ఇన్ని సంఘటనల మధ్య నిర్మాత డి.వి.వి.దానయ్య ఎక్కడా లేకపోవడం.. కనీసం ఆయన ప్రస్తావన కూడా ఎక్కడా రాకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ అయినప్పటి నుంచి ఆయన దాదాపు లైమ్ లైట్ కు పూర్తిగా దూరమయ్యారు. ఆర్ ఆర్ ఆర్ యొక్క ఆస్కార్ ప్రచారానికి అయ్యే ఖర్చు ఎంతైనా అది ఖర్చు చేయడానికి దానయ్య ఏమాత్రం ఆసక్తి చూపలేదని ఇండస్ట్రీలోని అంతర్గత వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఒక భారతీయ సినిమా ఆస్కార్ గెలవాలి అంటే అందుకు ఎంతో విలక్షణమైన ప్రచారం, అలాగే ఆ ప్రచారానికి భారీ మార్కెటింగ్, టూరింగ్ మరియు ఎందరినో కలుపుకునే కార్యకలాపాలు అవసరం. అయితే వాటి పై దానయ్య పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.

బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి రాజమౌళి కుటుంబం ఏ ఆస్కార్ ప్రచార ఖర్చులన్నీ ఖర్చు చేసిందట. దానయ్య ఎక్కడా కనిపించకపోవడానికి ఇదే కారణంగా చెప్తున్నారు . ఆర్ఆర్ఆర్ టీంను చూసి గర్వపడుతున్నానని, తన సినిమాకు ఆస్కార్ వస్తోండటం ఎంతో సంతోషం అని ఈ నిర్మాత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఆస్కార్ స్టేజ్ కు వెళ్లే ముందు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ త్రయం నుంచి ఎవరూ తనను సంప్రదించలేదని ఆయన ధృవీకరించారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version