టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 ప్రీమియర్ షోలు మొన్న రాత్రి 9:30 కి పలు ప్రాంతాల్లో ప్రదర్శితం అయ్యాయి. కాగా హైదరాబాదు సంధ్య థియేటర్ లో ప్రత్యేకంగా తన కుటుంబంతో కలిసి ప్రీమియర్ వీక్షించారు అల్లు అర్జున్. ఈ సందర్భంగా సంధ్య ధియేటర్ వద్ద భారీగా జనం దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది.
దానితో రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు తేజకు గాయాలయ్యాయి. అనంతరం రేవతి మృతి చెందగా కుమారుడు పరిస్థితి విషమంగా మారింది. దానితో పుష్ప 2 టీం పై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ ఘటన సిరియా సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇకపై తమ రాష్ట్రంలో ఎటువంటి స్పెషల్ షోస్ కి అనుమతి లేదంటూ నిర్ణయించారు.
అయితే తాజాగా కొద్దిసేపటి క్రితం స్పందించిన అల్లు అర్జున్ మాట్లాడుతూ ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని రేవతి గారి మృతి చింతిస్తున్నామని అన్నారు. అలానే వారి కుటుంబానికి రూ. 25 లక్షల నష్టపరిహారాన్ని అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ షోల్ రద్దు చేయటం ఇకపై స్టార్ హీరోల సినిమాలను ముందుగా చూడాలనుకున్న అభిమానులకి నిరాశ కలిగించే విషయం అని చెప్పాలి