కింగ్ అక్కినేని నాగార్జున, వెర్సటైల్ యాక్టర్ ధనుష్ ల కలయికలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ సినిమా కుబేర. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. లవ్ స్టోరీ అనంతరం శేఖర్ కమ్ముల తీస్తున్న మూవీ ఇది
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఒక సాంగ్ అలానే గ్లింప్స్ టీజర్ అందరిని ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాని జూన్ 20న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు తీసుకురనున్నట్లు ఇప్పటికే టీం అయితే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. కానీ తాజాగా వస్తున్న రూమర్స్ ప్రకారం ఈ మూవీ మరికొన్నాళ్లపాటు వాయిదా పడుతుందని కొందరు వార్తలు ప్రచారం చేశారు.
కాగా లేటెస్ట్ గా వాటిపై స్పందించిన కుబేర టీం తమ సినిమా పక్కాగా జూన్ 20న రిలీజ్ అవుతుందని, అందులో ఎటువంటి మార్పు లేదని త్వరలో ఒక్కొక్కటిగా అప్డేట్స్ అందించుకున్నామని తెలిపారు. మరి తొలిసారిగా నాగార్జున, ధనుష్ ల క్రేజ్ కాంబినేషన్ లో వస్తున్న కుబేర మూవీ రిలీజ్ అనంతరం ఎంత మేర విజయం అందుకుంటుందో చూడాలి.