యువనటుడు నితిన్ హీరోగా వెంకి కుడుముల దర్శకత్వంలో శ్రీలీల హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా రాబిన్ హుడ్. ప్రారంభం నుంచి అందరిలో కూడా మంచి అంచనాలు ఏర్పరిచి మరోవైపు ప్రమోషన్స్ పరంగా కూడా అదరగొట్టిన రాబిన్ హుడ్ మూవీ చివరకు థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఆశించిన స్థాయి రెస్పాన్స్ అందుకోలేకపోతోంది.
నితిన్ యాక్టింగ్ బాగానే ఉన్నప్పటికీ అనేక అంశాలు ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు. సెకండ్ హాఫ్ ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా లేదు. ముఖ్యంగా పలు సీన్స్ చాలా సాగతీతగా సాగటం ఈ సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పాలి. గతంలో నితిన్, వెంకీ ల కాంబినేషన్లో వచ్చిన భీష్మ పెద్ద విజయం అందుకోగా ప్రస్తుతం రాబిన్ హుడ్ మూవీ ఆల్మోస్ట్ డిజాస్టర్ పరిస్థితిలో బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది.
ఇక ఈ సినిమా అనంతరం తాజాగా యువ దర్శకుడు వేణు శ్రీరామ్ తో నితిన్ చేస్తున్న సినిమా తమ్ముడు. ఈ సినిమాపై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. దీనిని దిల్ రాజు నిర్మిస్తుండగా ఇందులో నితిన్ కి అక్క పాత్రలో ప్రముఖ నటి లయ కనిపించనున్నారు. అయితే ఈ సినిమాని వాస్తవానికి మేలో రిలీజ్ చేద్దాం అని భావించారట.
అయితే రాబిన్ హుడ్ ఫెయిల్యూర్ రిజల్ట్ తో మరికొన్నాళ్ల సమయం తీసుకుని దానిని మరింత క్వాలిటీగా ఏమైనా లోపాలు ఉంటే సరిచేసుకుని తెరకెక్కించేందుకు టీం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అదేరోజున హరి హర వీర మల్లు రిలీజ్ కూడా ఉండడంతో పక్కాగా తమ్ముడు పోస్ట్ పోన్ ఖాయం అంటున్నారు. త్వరలో దీని రిలీజ్ కి సంబంధించి అఫీషియల్ అప్ డేట్ రానున్నట్లు తెలుస్తోంది. ఇక తదుపరి తన నుంచి రానున్న సినిమాల విషయంలో నితిన్ కూడా జాగ్రత్తలు తీసుకోనున్నారట.